చంద్రబాబుకు అధికారం ఉంటే క్యాష్ పిటిషన్.. అవినీతి చేస్తే క్వాష్ పిటిషన్: జోగి రమేష్

By Sumanth Kanukula  |  First Published Oct 21, 2023, 3:09 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీలపై మంత్రి జోగి రమేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. భవిష్యత్‌కు గ్యారంటీ లేని వాళ్లంతా కలిసి ప్రజలకు భవిష్యత్తు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.


ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీలపై మంత్రి జోగి రమేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. భవిష్యత్‌కు గ్యారంటీ లేని వాళ్లంతా కలిసి ప్రజలకు భవిష్యత్తు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. టీడీపీలో చేతకాని వాళ్లంతా ఒక చోట చేరి ప్రభుత్వంపై విషం కక్కారని విమర్శించారు. తెలుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లాంటి వాళ్లు 40 ఏళ్ల రాజకీయాల్లో ఎక్కడా లేరని అన్నారు. చంద్రబాబు జీవితంలో ఇప్పటివరకు లక్షా 70 వేల కోట్ల రూపాయలు కొట్టేసాడని ఆరోపించారు. చంద్రబాబుకు ఆస్తులపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? అని ప్రవ్నించరాు. 

చంద్రబాబుకు ఆయన సామాజిక వర్గం తప్ప పేద కులాల నుంచి మద్దతుగా ఎవరూ రాలేదని విమర్శించారు. చంద్రబాబు పెత్తందార్ల పక్షాన ఉన్నాడని ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెత్తందార్ల పక్షాన పాలేరులా మారాడని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు అధికారం ఉంటే క్యాష్ పిటిషన్.. అవినీతి చేసి దొరికితే చేస్తే క్వాష్ పిటీషన్ అంటూ సెటైర్లు వేశారు. 

Latest Videos

2024 ఎన్నికల తర్వాత టీడీపీ నాయకులు కూరగాయలు కోసుకునే పరిస్థితి వస్తుందని వ్యంగ్య్రాస్త్రాలు సంధించారు. 20 ఏళ్ల పాటు ఏపీకి సీఎంగా జగన్ ఉండబోతున్నారని అన్నారు. ఎంతమంది పెత్తందార్లు కలిసి వచ్చినా మళ్లీ జగన్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. 

click me!