టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. చంద్రబాబుకు ఓట్లు కావాలి.. పవన్ కల్యాణ్‌కు నోట్లు కావాలని ఎంపీ ఆరోపించారు. వైసీపీ పాలనకు నూటికి నూరు శాతం ప్రజలు మద్ధతు ఇస్తారని ఎంపీ స్పష్టం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పల్లకీ మోయడానికే పవన్ పార్టీ పెట్టారని ఆరోపించారు. చంద్రబాబుకు సొంత కొడుకుపై నమ్మకం లేకే సినీ గ్లామర్‌తో పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నారని మార్గాని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఓట్లు కావాలి.. పవన్ కల్యాణ్‌కు నోట్లు కావాలని ఎంపీ ఆరోపించారు. చంద్రబాబు అవినీతి కుంభకోణంలో అరెస్ట్ కావడంతో పవన్ కల్యాణ్ రథసారథి పాత్ర పోషిస్తున్నారని భరత్ దుయ్యబట్టారు.
టీడీపీ, జనసేనలు రాజమండ్రిలో భేటీ అయినంత మాత్రాన ఫలితం ఏం వుండదని.. చంద్రబాబు 40 రోజులు జైల్లో వుంటేనే ఎలాంటి స్పందనా లేదని ఆయన చురకలంటించారు. 45 ఏళ్ల రాజకీయ చరిత్ర వున్న చంద్రబాబు.. తాను అరెస్ట్ అయితే జనం ఎందుకు స్పందించడం లేదో గ్రహించాలన్నారు. ఆయన రాజకీయాలు అర్ధమయ్యాయి కాబట్టే జనంలో స్పందన , సానుభూతి కనిపించడం లేదన్నారు. పవన్ కల్యాణ్‌కు రాజకీయ కార్యాచరణ లేదని.. పదీ పదిహేను మందికి డబ్బులిస్తే సరిపోతుందా అని మార్గాని భరత్ ప్రశ్నించారు. వైసీపీ పాలనకు నూటికి నూరు శాతం ప్రజలు మద్ధతు ఇస్తారని ఎంపీ స్పష్టం చేశారు.
Also Read: తీర్పులు అనుకూలంగా రాకుంటే న్యాయమూర్తులపై ట్రోలింగ్.. వారంతా అసాంఘీక శక్తులే: సీఎం జగన్
అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పల్లకీ మోయడానికే పవన్ పార్టీ పెట్టారని ఆరోపించారు. చంద్రబాబుకు సొంత కొడుకుపై నమ్మకం లేకే సినీ గ్లామర్‌తో పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నారని మార్గాని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఓట్లు కావాలి.. పవన్ కల్యాణ్‌కు నోట్లు కావాలని ఎంపీ ఆరోపించారు. చంద్రబాబు అవినీతి కుంభకోణంలో అరెస్ట్ కావడంతో పవన్ కల్యాణ్ రథసారథి పాత్ర పోషిస్తున్నారని భరత్ దుయ్యబట్టారు.