AP Cabinet Meet: ఈనెల 31న ఏపీ మంత్రివర్గ సమావేశం.. అధికారుల‌కు కీల‌క ఆదేశాలు

By Mahesh RajamoniFirst Published Oct 21, 2023, 2:04 PM IST
Highlights

AP Cabinet Meet: ఈ నెల 31న‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. అయితే, ఈ స‌మావేశంలో రాజ‌ధాని మార్పు, విశాఖ నుంచి పాల‌న కొన‌సాగించ‌డం స‌హా ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. ప‌లు సంక్షేమ ప‌థ‌కాల‌పై కూడా కీల‌క నిర్ణయాలు తీసుక‌కునే అవ‌కాశ‌ముంద‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. 
 

AP Cabinet Meeting: ఈ నెల 31న‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. అయితే, ఈ స‌మావేశంలో రాజ‌ధాని మార్పు, విశాఖ నుంచి పాల‌న కొన‌సాగించ‌డం స‌హా ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. ప‌లు సంక్షేమ ప‌థ‌కాల‌పై కూడా కీల‌క నిర్ణయాలు తీసుక‌కునే అవ‌కాశ‌ముంద‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. ఇప్ప‌టికే ద‌స‌రా త‌ర్వాతి నుంచి విశాఖ‌ప‌ట్నం నుంచి పాల‌న సాగించ‌నున్న‌ట్టు వైఎస్ఆర్సీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

వివ‌రాల్లోకెళ్తే.. ఈ నెల 31న వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశ మందిరంలో సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే మంత్రుల‌కు, అధికారుల‌కు స‌మాచారం అందించిన‌ట్టు పేర్కొన్నారు. సచివాలయంలోని అన్ని శాఖల ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు/ ముఖ్య కార్యదర్శులు/ కార్యదర్శులు తమ ప్రతిపాదనలను (ఒక్కొక్కటి 50 కాపీలు) క్యాబినెట్ హ్యాండ్ బుక్ లో వివరించిన విధంగా నిర్ణీత ఫార్మాట్ లో పంపాలనీ, సాధారణ పరిపాలనకు సూచించిన సూచనల్లో జారీ చేసిన సూచనలతో సహా ఎప్పటికప్పుడు ఆదేశాలను పాటించాలని కోరారు.

ఈ ప్రతిపాదనపై క్యాబినెట్ మెమోరాండం సాఫ్ట్ కాపీని వర్డ్/పీడీఎఫ్ ఫార్మాట్లలో, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ (పీపీటీ) సాఫ్ట్ కాపీలను అందజేయాలని ఆయా శాఖలను కోరినట్లు జవహర్ రెడ్డి తెలిపారు. సచివాలయంలోని అన్ని శాఖల ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు/ ముఖ్య కార్యదర్శులు/ కార్యదర్శులు ఏపీ ప్రభుత్వ బిజినెస్ రూల్స్, సెక్రటేరియట్ సూచనలను పక్కాగా పాటిస్తూ నిర్ణీత గడువులోగా ప్రతిపాదనలు పంపాలని కోరారు.

ఇదిలావుండ‌గా, జ‌ర‌గ‌బోయే ఏపీ మంత్రివ‌ర్గం స‌మావేశంలో పాల‌న‌ను విశాఖ నుంచి కొన‌సాగించే విష‌యం గురించి కూడా చ‌ర్చించే అవ‌కాశ‌ముంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్‌లో విశాఖపట్నంకు మారనున్నట్లు గ‌త‌వారం తెలిపారు. మొదట్లో దసరాకు ఓడరేవు నగరానికి మారాలనేది ప్ర‌ణాళిక‌గా ఉంది. "నాకు, ఇతరులకు అనువైన స్థలం కోసం నేను నా సిబ్బందిని అడిగాను. వారు దానిపై పని చేస్తున్నారు. CMO భారీ భద్రతా యంత్రాంగాన్ని కలిగి ఉండాలి. వీటిని ప్రణాళిక-అమలు చేయడానికి సమయం పడుతుంది. త్వ‌ర‌లోనే పాల‌న వైజాగ్ కు మారుతుంది. ఇది టైర్‌-1 నగరం" అని సీఎం అన్నారు. అయితే, ఇది డిసెంబ‌ర్ కు ఔట‌ర్ లైన్ కావ‌చ్చున‌ని ఇన్ఫోసిస్ ప్రాంగణాన్ని లాంఛనంగా ప్రారంభించిన తర్వాత సీఎం అధికారులు, ప్ర‌భుత్వ సిబ్బంతితో అన్నారు.

click me!