పంచాయతీ ఎన్నికల ఫలితాలు.. వరల్డ్ కప్ గెలిచినట్లుగా ఫీలింగ్ : టీడీపీపై మంత్రి గుడివాడ సెటైర్లు

By Siva KodatiFirst Published Aug 20, 2023, 4:46 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఉప ఎన్నికల ఫలితాలపై స్పందించారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. ఉప ఎన్నికల ఫలితాలు చూసి టీడీపీ గల్లీ క్రికెట్ గెలిచి వరల్డ్ కప్ గెలిచినట్లుగా ఫీలవుతోందన్నారు. ఎందరు కలిసొచ్చినా 2019 ఎన్నికల ఫలితాలే 2024లోనూ రిపీట్ అవుతాయని గుడివాడ జోస్యం చెప్పారు. 
 

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఉప ఎన్నికల ఫలితాలపై స్పందించారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉప ఎన్నికల ఫలితాలు చూసి టీడీపీ గల్లీ క్రికెట్ గెలిచి వరల్డ్ కప్ గెలిచినట్లుగా ఫీలవుతోందన్నారు. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైసీపీయే గెలిచిందని అమర్‌నాథ్ అన్నారు. అప్పుడప్పుడు గెలిచే వారి ఆనందం టీడీపీ ఫేస్‌లో కనిపిస్తోందని మంత్రి సెటైర్లు వేశారు.

పవన్, టీడీపీ కలయిక గురించి కూడా అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం వ్యతిరేక ఓట్లు చీల్చడానికి వేరుగా పోటీ చేయడం, టీడీపీ అనుకూల ఓట్లు చీలకుండా వుండేందుకు కలిసి పోటీ చేయడం పవన్‌కు అలవాటుగా మారిందన్నారు. ఎందరు కలిసొచ్చినా 2019 ఎన్నికల ఫలితాలే 2024లోనూ రిపీట్ అవుతాయని గుడివాడ జోస్యం చెప్పారు. 

Also Read: నేను ఏ పార్టీలో బలి పశువునయ్యానో అందరికీ తెలుసు : టీడీపీకి దేవినేని అవినాష్ కౌంటర్

అంతకుముందు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ పై బురద చల్లడమే ధ్యేయంగా చంద్రబాబు పనిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పట్టవన్నారు.గుంటూరు,విజయవాడకు చంద్రబాబు అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. సీఎంగా ఉన్న సమయంలో విజయవాడలో చంద్రబాబు 45 ఆలయాలను  కూల్చారని ఆయన గుర్తు చేశారు. 

లోకేష్ పాదయాత్ర అబద్దాలతో సాగుతుందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు.వారధి మీద  ఫోటో కోసం రూ.5 కోట్లు ఖర్చు చేశారన్నారు. కిరాయికి జనాన్ని తీసుకు వచ్చి లోకేష్ యాత్ర  నిర్వహిస్తున్నారని విష్ణు ఆరోపించారు. జన్మభూమి కమిటీలతో గత ప్రభుత్వం దోపిడీకి పాల్పడిందన్నారు . డీబీటీ ద్వారా  నేరుగా లబ్దిదారులకు  నిధులు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. లోకేష్‌ది యువగళం పాదయాత్ర కాదు ఈవినింగ్ వాక్ అంటూ దేవినేని అవినాష్ సెటైర్లు వేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్ అని లోకేష్ పాదయాత్రను టీడీపీ నేతలే పట్టించుకోవడం లేదన్నారు. ఇతర ప్రాంతాల నుండి జనాన్ని తరలించి  షో నిర్వహిస్తున్నారని  వెల్లంపల్లి ఆరోపించారు. 

click me!