బాబుకు షాక్: ఆనంతో గంటా భేటీ, టిడిపిలో ఇమడలేనన్న రామనారాయణరెడ్డి

First Published Jun 24, 2018, 2:30 PM IST
Highlights

నెల్లూరులో టిడిపికి ఎదురు దెబ్బ

నెల్లూరు: మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని టిడిపిని వీడకుండా  టిడిపి నాయకత్వం మరోసారి రాయబారాన్ని నడిపింది. ఏపీ ఉన్నత విద్యాశాఖ మంత్రి  గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో శనివారం నాడు భేటీ అయ్యారు. పార్టీ  మార్పు విషయమై ఆనంతో  గంటా చర్చించినట్టు సమాచారం. టిడిపిలోనే కొనసాగాలని ఆనం‌ను గంటా కోరారని సమాచారం. అయితే పార్టీలోనే తాను ఇమడలేననే ఆనం రామనారాయణరెడ్డి పార్టీ గంటాకు చెప్పినట్టు సమాచారం.

మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి టిడిపిని వీడి వైసీపీలో చేరాలని భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. టిడిపి నాయకత్వం తనకు  సరైన గౌరవం ఇవ్వలేదని  ఆనం రామనారాయణరెడ్డి  భావిస్తున్నారు. ఈ మేరకు వైసీపీలో చేరాలని ఆయన భావిస్తున్నారు. 

ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరితే రాజకీయంగా తమకు నష్టమని టిడిపి భావిస్తోంది. చివరి ప్రయత్నంగా  టిడిపి నాయకత్వం మంత్రి గంటా శ్రీనివాసరావును రాయబారానికి  పంపారు. శనివారం నాడు  మంత్రి గంటా శ్రీనివాసరావు  మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో భేటీ అయ్యారు. 

పార్టీ వీడాలని భావిస్తున్న ఆనం రామనారాయణరెడ్డితో గంటా శ్రీనివాసరావు చర్చించారు. రామనారాయణరెడ్డిని పార్టీని వీడకూడదని ఆయన కోరినట్టు సమాచారం. ఈ విషయమై ఇద్దరూ చర్చించారు. 

నెల్లూరు జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి గంటా శ్రీనివాసరావు సాయంత్రం ఆనం రామనారాయణరెడ్డితో సమావేశమయ్యారు. టీడీపీలో కొనసాగాలని ఆనం కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని శ్రీనివాసరావు ఆనంకు తెలిపినట్టు తెలిసింది.

అయితే ఈ సూచనను రామ నారాయణరెడ్డి సున్నితంగా తిరస్కరిస్తూ టీడీపీలో ఇమడలేమని గంటా శ్రీనివాసరావుకు ఆనం రామనారాయణరెడ్డి చెప్పారని సమాచారం. కేవలం పాత పరిచయాల నేపథ్యంలో తన కుటుంబాన్ని పరామర్శించడం కోసం గంటా తనను కలిశారని అన్నారు. అంతకు మించి ఈ భేటీలో రాజకీయ ప్రస్తావనలు ఏమీ రాలేదని తెలిపారు.

ఇప్పటికే పార్టీ మారాలని ఆనం రామనారాయణరెడ్డి నిర్ణయం తీసుకొన్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.దీంతో ఆయన వైసీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఇటీవలనే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ,వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిలు ఆనం రామనారాయణరెడ్డితో సమావేశమయ్యారు. 

వైసీపీలో చేరేందుకు ఆనం రంగం సిద్దం చేసుకొన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. త్వరలోనే  ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలోనే చేరే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు.


 

click me!