దుర్గమ్మ గుడికొచ్చి... ధర్నాకెళ్లారు, అంతా డ్రామానే: బాబు దంపతులపై బొత్స ఫైర్

By sivanagaprasad KodatiFirst Published Jan 2, 2020, 3:51 PM IST
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దంపతులు కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చి రైతుల ఆందోళనలో పాల్గొన్నారని ఆయన ఆరోపించారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దంపతులు కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చి రైతుల ఆందోళనలో పాల్గొన్నారని ఆయన ఆరోపించారు.

రైతులకు గాజులివ్వడం కాదని.. భూములివ్వాలని బొత్స డిమాండ్ చేశారు. తనను చూసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భయపడేవారని.. చంద్రబాబు చెబుతున్నారని అది తనకు ఆశ్చర్యంగా అనిపిస్తోందన్నారు.

Also Read:ఇవ్వాల్సింది గాజులు కాదు... భువనేశ్వరికి పుష్ప శ్రీవాణి కౌంటర్

5 కోట్ల మంది ఆంధ్రుల్లో ఏ ఒక్కరిని అడిగినా ఈ ప్రశ్నకు సమాధానం సరైన సమాధానం చెబుతారని బొత్స సెటైర్లు వేశారు. చంద్రబాబు రాజకీయ చరిత్ర అందరికీ తెలుసునని, బాబు రాజకీయంగా ఎదగడానికి.. మంత్రి పదవి దక్కడం వెనుక వైఎస్ అండగా నిలిచారని బొత్స గుర్తుచేశారు.

ఇలాంటి మాటల చంద్రబాబుకు వచ్చే ఉపయోగం ఏంటని ఆయన ప్రశ్నించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో చంద్రబాబు ఐదేళ్ల కాలంలో సరిగ్గా పనిచేసుంటే ఏపీకి ఈ పరిస్ధితి వుండేది కాదని బొత్స ఎద్దేవా చేశారు.

Also Read:చెప్పినా వినలేదు, వైసీపీకి ఓట్లేసి కుంపటి పెట్టుకొన్నారు: చంద్రబాబు

ఆర్థిక లోటుతో పాటు అప్పుల పాలవ్వడం కానీ మేము వచ్చిన తర్వాత విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదని బొత్స తెలిపారు. ఒక టౌన్‌షిప్ కడితే సంపద వస్తుందా.. ఆ ప్రాతంలో భూముల ధరలు పెరిగితే, పెరిగి ఉండొచ్చు... కానీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయా అని మంత్రి ప్రశ్నించారు. 

click me!