చంద్రబాబు, లోకేష్ దొరికిపోయారు .. పవన్ కిరాయి కోటిగాడు, మరిది కోసమే ఢిల్లీకి పురందేశ్వరి : అంబటి రాంబాబు

By Siva Kodati  |  First Published Oct 10, 2023, 5:29 PM IST

టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు మంత్రి అంబటి రాంబాబు. దొంగ అన్నిసార్లు తప్పించుకోలేడని చంద్రబాబు విషయంలో రుజువైందన్నారు. దత్తపుత్రుడు పీకే కాదు కేకే.. కిరాయి కోటిగాడిలా తయారయ్యారని అంబటి చురకలంటించారు. 


టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు మంత్రి అంబటి రాంబాబు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చట్టం నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కాం చేయలేదని చెప్పుకోలేకపోతున్నారని అంబటి ఫైర్ అయ్యారు. దొంగలు దొరికిపోయారని ప్రజలకు తెలిసిపోయిందని.. టెక్నికల్ అంశాలపైనే చంద్రబాబు లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు తప్పించి, నేరం చేయలేదని చెప్పడం లేదన్నారు.

చట్టంలో లొసుగులున్నాయా అని చంద్రబాబు వెతుకుతున్నారని రాంబాబు ఎద్దేవా చేశారు. గతంలో అనేకసార్లు విచారణల నుంచి చంద్రబాబు తప్పించుకున్నారని అంబటి దుయ్యబట్టారు. సీఐడీ అన్ని ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేసిందని మంత్రి తెలిపారు. దొంగ అన్నిసార్లు తప్పించుకోలేడని చంద్రబాబు విషయంలో రుజువైందన్నారు. 

Latest Videos

ALso Read: నేరస్తులకు రక్షణ కవచంగా 17ఏ మారొద్దు: సుప్రీంలో సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ

లోకేష్ దొరికిపోయారని ప్రజలకు అర్ధమవుతోందని.. ఇన్ని రోజులు లోకేష్ ఢిల్లీ ఓపెన్ జైలులో వున్నారని రాంబాబు దుయ్యబట్టారు. పురందేశ్వరి బంధుత్వ ప్రేమతో ఆరాటపడుతున్నారని.. ఆమె తన మరిదిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. 17ఏను అడ్డుపెట్టుకుని తప్పించుకోవాలని చూస్తున్నారని రాంబాబు ఆరోపించారు. వ్యవస్థలను మేనేజ్ చేసే దొంగ చంద్రబాబని.. రింగో రోడ్ అలైన్‌మెంట్ ఎందుకు మార్చారు.. దీని వల్ల ఎవరు లాభపడ్డారని ఆయన ప్రశ్నించారు. 

చంద్రబాబును కాపాడేందుకు పురందేశ్వరి ఢిల్లీ వెళ్లారని రాంబాబు ఆరోపించారు. మంత్రి రోజాపై బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలను పురందేశ్వరి ఖండించలేదన్నారు. దత్తపుత్రుడు పీకే కాదు కేకే.. కిరాయి కోటిగాడిలా తయారయ్యారని అంబటి చురకలంటించారు. చంద్రబాబు పార్టీని కాపాడేందుకే పవన్ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. అది జనసేన కాదని.. బాబు సేన అని రాంబాబు దుయ్యబట్టారు. కాపుల ఓట్లను చంద్రబాబుకు అమ్మేందుకు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టారని అంబటి ఆరోపించారు. 

click me!