జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్..!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్టుగా  తెలుస్తోంది. 

Google News Follow Us

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్టుగా  తెలుస్తోంది. దీంతో బుధవారం జరగాల్సిన జనసేన విస్తృత స్థాయి సమావేశాన్ని ఆ పార్టీ వాయిదా వేసినట్టుగా సమాచారం. ఈ మేరకు కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. వివరాలు.. తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టుగా పవన్ కల్యాణ్ ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లే అంశంపై పవన్ కల్యాణ్.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు బుధవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం  ఏర్పాటు చేశారు. 

అయితే పవన్‌ కల్యాణ్‌ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ కీలక సమావేశాన్నివాయిదా వేస్తున్నట్టుగా జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఈ సమావేశానికి సంబంధించిన మరో తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నాయి.

Read more Articles on