మంత్రిగారి రక్తం పచ్చగా ఉంటుందట !

Published : Apr 08, 2017, 08:29 AM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
మంత్రిగారి రక్తం పచ్చగా ఉంటుందట !

సారాంశం

ఇప్పటి వరకూ రక్తం ఎర్ర రంగులోనే ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. ఏవో బొద్దింకల లాంటి కొన్ని జీవాలకు మాత్రం రక్తం తెల్లగా ఉంటుందని సైన్స్ చెబుతోంది. మరి, ఈ మంత్రిగారి రక్తం పచ్చగా ఎలా ఉంటుంది?

ఈ మత్రిగారి రక్తం పచ్చగా ఉంటుందట. ఇప్పటి వరకూ రక్తం ఎర్ర రంగులోనే ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. ఏవో బొద్దింకల లాంటి కొన్ని జీవాలకు మాత్రం రక్తం తెల్లగా ఉంటుందని సైన్స్ చెబుతోంది. మరి, ఈ మంత్రిగారి రక్తం పచ్చగా ఎలా ఉంటుంది? చిత్తూరు జిల్లా నుండి కొత్తగా మంత్రివర్గంలో చేరిన ఎన్.అమరనాధ్ రెడ్డి తిరుపతికి చేరుకున్నారు. అందులో భాగంగా కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ తన రక్తం మొదటి నుండీ పచ్చగానే ఉంటుందని, తమ కుంటుంబం మొత్తం మొదటి నుండి టిడిపిలోనే ఉందని చెప్పారు. దాంతో నేతలు, కార్యకర్తలు ఆశ్చర్యపోయారు.

మంత్రిగారి రక్తం పచ్చగానే ఉంటే, కుటుంబం మొత్తం మొదటి నుండి టిడిపిలోనే ఉంటే మరి మధ్యలో మాత్రం ఎందుకని ఎరుపెక్కింది?  మంత్రి చెప్పింది ఒకటి మాత్రం నిజం. తన తండ్రి రామకృష్ణారెడ్డి టిడిపిలో దశాబ్దాల పాటు సేవలందించారు. చిత్తూరు ఎంపిగా, పుంగనూరు ఎంఎల్ఏగా సంవత్సరాల తరబడి పనిచేసారు. అటువంటిది తండ్రి పోయిన తర్వాత కూడా అమరనాధ్ రెడ్డి టిడిపిలో క్రియాశీలకంగానే ఉన్నారు.

ఏమైందో ఏమో హటాత్తుగా టిడిపిని వీడి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపునే పలమనేరు పోటీచేసి గెలిచారు. మొదట్లో జగన్ తో అమర్ సంబంధాలు బాగానే ఉండేవి. అయితే, మొదటి నుండి పుంగనూరు ఎంఎల్ఏ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పడదు. మొత్తానికి ఏడాది క్రితం హటాత్తుగా వైసీపీకి గుడ్ బై చెప్పి టిడిపిలో చేరిపోయారు. ఇపుడు మంత్రికూడా అయిపోయారు. దాంతో మంత్రిగారి రక్తం మళ్ళీ పచ్చబడిపోయినట్లుంది.

PREV
click me!

Recommended Stories

Ambati Rambabu Pressmeet: చంద్రబాబు, పవన్ పై అంబటి సెటైర్లు | Asianet News Telugu
Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu