కేశినేని బస్సూ పాయే, సీటు పోతుందేమో...

First Published Apr 8, 2017, 6:49 AM IST
Highlights

సిఎం తనతో  ట్రాన్స్ ఫోర్టు కమిషనర్ కు  బలవంతంగా క్షమాపణలు చెప్పించడంతో నాని బాగా అప్ సెట్ అయ్యాడని, దానివల్లే ఆయన బస్సులాపేయాలని నిర్ణయించాడని చెబుతున్నారు. ఇలాంటపుడే వచ్చేసారి విజయవాడ లోక్ సభ సీటుకు నారా బ్రాహ్మణి పోటీచేయవచ్చనే ప్రచారం  కూడా మొదలయింది.

టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని వాస్తు ఎక్కడో బెడిసినట్లుంది. నడుస్తున్నవి, రాబోయేవి కూడా మంచిరోజులు కానట్లున్నాయి. ఇపుడాయన బస్సులు ఆపేశాడు.  పార్టీ వాళ్ల చెప్పే దాని ప్రకారం ముందుముందు విజయవాడ లోక్ సభ సీటు కూడా వదులు కోవలసి వస్తుందట.

 

 నిన్న రాత్రి  కోపంగా నాని తన కేశినేని ట్రావెల్స్‌ను మూసివేశారు.  విజయవాడ హైదరాబాద్ రోడ్లు రాత్రి పూట పూర్తిగా జామ్ అయ్యందుకు కారణమయిన సర్వీసులలో కేశినేని ఒకటి. ఇలాంటి ముఖ్యమయిన రవాణా సర్వీసును ఆయన ఉన్నఫలానా మూసేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కంపెనీ అధికారికంగా ‘మూత’పడింది. సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో పలుచోట్ల ఆందోళనకు దిగుతున్నారని సమాచారం. బస్సులు మూసేసి కార్గో వైపు మళ్లుతాడని, కొందరికి అందులో ఉద్యోగాలిచ్చి, ఇంకొందరిని ఇంటికి పంపిస్తాడని చెబుతున్నారు.

 

ఈ మధ్య బోండా ఉమామహేశ్వరరావు అనే పెద్ద మనిషితో కలసి నాని  హెడ్ లైన్ అయి మారుమ్రోగిన సంగతి తెలిసిందే. రవాణ శాఖ కార్యాలయం వద్ద ట్రాన్స్ పోర్ట కమీషనర్ బాలసుబ్రహ్మణ్యం పట్ల నాని, బోండా ఎంత దౌర్జన్యంగా ప్రవర్తించారో దేశమంతా చూసింది. ఇద్దరు బెజవాడ పాలెగాళ్లలాగా ప్రవర్తించి అధికార పార్టీకి బాగా అపకీర్తి తెచ్చారు.  దాందెబ్బకే బోండాకు మంత్రిపదవి ఢామ్మనిందని గుసగుసలు.తెలుగుదేశం ప్రజా ప్రతినిధుల పరువు కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి స్వయంగా దిగి, మ్యాటర సెటిల్ చేసేశాడు.  ఆచాప్టర్ అయిపోయిందనిపించాడు. ఆ వార్త అన్ని పేపర్లలో చానెళ్లలో మరొక హైడ్ లైన్ లోని నానిని  లాక్కొచ్చింది.అక్కడే నానికి కాలిందంటున్నారు.

 

తనతో ఈ ప్రకారంగా  బలవంతంగా క్షమాపణలు చెప్పించడంతో నాని బాగా అప్ సెట్ అయ్యాడని, దానివల్లే ఆయన బస్సులాపేయాలని నిర్ణయించాడని చెబుతున్నారు.

 

పోయేది బస్సేగదా అనుకుంటే,  ముఖ్యమంత్రి కోడలు నారా బ్రాహ్మణి  2019లో  లోక్ సభ కు పోటీచేయాలనుకుంటున్నారని, ఆమె విజయవాడను ఎంపిక చేసుకునే ప్రమాదం ఉందని కూడా వినపడుతూ ఉంది.  కెసిఆర్ కూతురు కవిత,ములాయం కోడలు ఢింపుల్ యాదవ్, శరద్ పవార్ కూతురు సుప్రియా శూలే...  ఇలా కూతుళ్ల, కోడళ్ల లో పెద్ద సర్కిలొకటి పార్లమెంటులో ఎప్పుడో ఏర్పడింది.  బ్రాహ్మణి కూడా అటేపు వెళతారేమో...

click me!