కరోనా భయంతో హైదరాబాద్‌ పారిపోయి.. ఇప్పుడు దొంగ దీక్షలా : చంద్రబాబుపై మంత్రి ఆళ్ల నాని ఫైర్

Siva Kodati |  
Published : Jun 29, 2021, 04:45 PM IST
కరోనా భయంతో హైదరాబాద్‌ పారిపోయి.. ఇప్పుడు దొంగ దీక్షలా : చంద్రబాబుపై మంత్రి ఆళ్ల నాని ఫైర్

సారాంశం

కరోనా భయంతో చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారని ఆరోపించారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. మంగళవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్ కాలంలో చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని టైమ్‌పాస్ చేశారంటూ సెటైర్లు వేశారు.

కరోనా భయంతో చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారని ఆరోపించారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. మంగళవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్ కాలంలో చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని టైమ్‌పాస్ చేశారంటూ సెటైర్లు వేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు కనిపించలేదా అని ఆళ్ల నాని ప్రశ్నించారు. చంద్రబాబు ఇవాళ చేసిన దీక్షతో సాధించింది ఏంటని మంత్రి నిలదీశారు. కోవిడ్ నివారణా చర్యలపై ప్రధాని ప్రశంసిస్తే మీకు కనిపించలేదా అంటూ మండిపడ్డారు.

మూడు గంటలు చేసే దాన్ని దీక్ష అంటారా అంటూ ఆళ్ల  నాని ఫైరయ్యారు. చంద్రబాబు దొంగ దీక్షలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని .. టీడీపీ హయాంలో రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని నాని ఆరోపించారు. ప్రజలు కష్టాల్లో వుంటే చంద్రబాబు హైదరాబాద్‌కే పరిమితమయ్యారంటూ ఆయన దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో దాక్కుని రాష్ట్రంపై రాళ్లు వేశారంటూ ధ్వజమెత్తారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేశారంటూ ఆళ్లనాని ఫైరయ్యారు. చంద్రబాబు రోజురోజుకు దిగజారిపోతున్నారని దుయ్యబట్టారు.

Also Read:కరోనాతో బాధితులకు పరిహారం: టీడీపీ చీఫ్ చంద్రబాబు నిరసన దీక్ష

ప్రభుత్వంపై తప్పుడు విమర్శలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. చంద్రబాబులా జగన్ తప్పుడు దీక్షలు చేయలేదని.. కరోనా నివారణ చర్యల్లో ఏపీ ఆదర్శంగా నిలిచిందని ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఐసీఎంఆర్ ప్రొటోకాల్స్ తెలియకుండా చంద్రబాబు వ్యాఖ్యలు వున్నాయని ఆయన మండిపడ్డారు. సీఎం జగన్‌పై బురద జల్లేందుకే చంద్రబాబు కుట్రలు చేస్తున్నామని ఆళ్ల నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారంటూ చురకలు వేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?