గురువుల కంటే గూగుల్ మేలు వ్యాఖ్యలపై దుమారం.. క్లారిటీ ఇచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్

By Siva KodatiFirst Published Sep 6, 2023, 9:19 PM IST
Highlights

గురువుల కంటే గూగుల్ మేలు అంటూ ఏపీ మంత్రి ఆదిమూలపు శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.  దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను అనని మాటలను అన్నట్లుగా ప్రచారం జరుగుతోందని ఫైర్ అయ్యారు.

గురువుల కంటే గూగుల్ మేలు అంటూ ఏపీ మంత్రి ఆదిమూలపు శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వివాదం ముదురుతూ వుండటంతో ఆయన స్పందించారు. తాను అనని మాటలను అన్నట్లుగా ప్రచారం జరుగుతోందని ఫైర్ అయ్యారు. ఈ తరహా వైఖరిని తాను ఖండిస్తున్నానని మంత్రి స్పష్టం చేశారు. మారుతున్న కాలంలో కొందరు సాంకేతికతను అందిపుచ్చుకుని గూగుల్‌పై ఆధారపడుతూ గురువులను మరచిపోతున్నారనే తాను మాట్లాడినట్లు ఆదిమూలపు సురేష్ తెలిపారు. తల్లిదండ్రులు, గురువులపై తనకు అపార గౌరవం వుందని మంత్రి పేర్కొన్నారు. 

కాగా.. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ప్రస్తుత ఆధునిక కాలంలో గురువుల పాత్ర తగ్గిపోయిందని అన్నారు. గురువుల స్థానంలో గూగుల్ వచ్చిందని... దీంతో విద్యార్థులకు టీచర్ల అవసరం పెద్దగా లేకుండా పోయిందన్నారు. ఉపాధ్యాయులకు తెలియని విషయాలను కూడా గూగుల్ చెబుతుందన్నారు. ఇలా గురువుల కన్నా గూగుల్ మిన్న అనేలా మంత్రి మాట్లాడారు. 

ALso Read: గురువుల కన్నా గూగుల్ మిన్న..!: టీచర్స్ డే వేడుకల్లో ఏపీ మంత్రి సంచలనం

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు సాంకేతికతను అందుబాటులోకి తెస్తోందని... అందులో భాగంగానే ట్యాబ్ లు అందించడం జరిగిందని మంత్రి తెలిపారు. బైజూస్ తో ఒప్పందం చేసుకుని విద్యార్థులకు అధునాతన విద్య అందిస్తోందని అన్నారు. ఇలా ఏపీ విద్యార్థులకు జగన్ సర్కార్ ప్రపంచస్థాయి విద్యను అందిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 
 

click me!