యువగళం పాదయాత్ర .. భీమవరంలో ఘర్షణ , 52 మంది టీడీపీ నేతలపై కేసులు

Siva Kodati | Published : Sep 6, 2023 8:51 PM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ఘర్షణలకు సంబంధించి 52 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Google News Follow Us

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ఘర్షణలకు సంబంధించి 52 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో 38 మంది యువగళం వాలంటీర్లు, 14 మంది నాయకులు వున్నారు. చింతమనేని ప్రభాకర్, తోట సీతారామలక్ష్మీ సహా 14 మందిపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. వీరిని వివిధ కోర్టుల్లో హాజరుపరిచారు. 

కాగా.. భీమవరంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా టీడీపీ నేతలు పట్టణంలో ఫ్లెక్సీలు , బ్యానర్లను ఏర్పాటు చేశారు. దీనికి కౌంటర్‌గా వైసీపీ నేతలు కూడా ఫ్లెక్సీలను కట్టడంతో గొడవ జరిగింది. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. అయితే రాళ్ల దాడిలో పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. 

Read more Articles on