
తెలంగాణ సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టక ముందు ఆ ప్రాంతంలోని చాలా జిల్లాల్లోని ప్రజలు ముంబాయ్, సూరత్ వంటి ప్రాంతాలకు వలసలు వెళ్లేవారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రా ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వలసలు వెళ్తున్నారని చెప్పారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద... కృష్ణా పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తం
ఏపీ వైసీపీ ప్రభుత్వం విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు సరిగ్గా అమలు కావడం లేదని రఘురామకృష్ణరాజు అన్నారు. ఆ పథకాలు సరిగ్గా అమలు జరిగితే రాష్ట్రంలోని ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల్లో సీట్లు ఎందుకు పూర్తిగా భర్తీ కావడం లేదని అన్నారు. దేశంలోని అన్ని కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గాయని సాక్షి దినపత్రికలో స్టోరీలు వచ్చాయని తెలిపారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు స్టూడెంట్లకు అడ్మిషన్లు దొరకడం లేదని చెప్పారు.
జగన్‌ను కలిసిన ఫెన్సింగ్ క్రీడాకారిణి బేబి రెడ్డి, పారా సైక్లిస్ట్ అర్షద్
ఏపీలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో 1.40 లక్షల సీట్లు ఉన్నాయని అన్నారు. అందులో కేవలం 78 వేల సీట్లే భర్తీ అయ్యాయని అన్నారు. అలాగే డిగ్రీలో కూడా కేవలం 40 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని తెలిపారు. అది కేవలం సాక్షిలోనే కనిపిస్తోందని పేర్కొన్నారు. ఏపీ ప్రజలు నిరాశలో ఉన్నారని ఆరోపించారు.
ఇంద్రకీలాద్రిపై ఐదు స్లాట్స్‌లో దుర్గమ్మ దర్శనాలు.. వీఐపీ లెటర్స్‌పైనా ఆంక్షలు : కొట్టు సత్యనారాయణ
ఏపీలో ఉద్యోగులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ట్రైన్లలో, బస్సుల్లో పోలీసులుతో తనిఖీలు చేపట్టడం సరైంది కాదని అన్నారు. సొంత డబ్బులతో పేద ప్రజలకు ఆహారం అందించాలని ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను నాశనం చేయడం దారుణం అని అన్నారు. ప్రతీ విషయంలోనూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సూట్ కేసులతో దాడులు చేస్తున్నారని చెప్పారు. వాటిని తట్టుకొని తనకు న్యాయం దక్కుతుందని నమ్మకం ఉందని పేర్కొన్నారు.
సీపీఎస్ హామీ మరిచిపోయినందునే రోడ్డెక్కారు.. ఉద్యోగులపై వేధింపులొద్దు: జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం
రాష్ట్రంలో ఉన్న ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్లు, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్లు వారి హక్కులపై మాట్లాడాలని తెలిపారు. వారి హక్కులపై వారే పోరాడలేని వారి రాష్ట్ర ప్రజలను సమస్యలను ఎలా పరిష్కారం చేస్తారని అన్నారు.