ఎన్టీఆర్ విగ్ర‌హాలు ధ్వంసం కాకుండా చ‌ర్య‌లు తీసుకోండి.. డీజీపీకి లేఖ‌ రాసిన చంద్ర‌బాబు నాయ‌డు

Published : Jan 03, 2022, 03:49 PM IST
ఎన్టీఆర్ విగ్ర‌హాలు ధ్వంసం కాకుండా చ‌ర్య‌లు తీసుకోండి.. డీజీపీకి లేఖ‌ రాసిన చంద్ర‌బాబు నాయ‌డు

సారాంశం

ఏపీలోని గుంటూరు జిల్లాలో దుర్గి మండల కేంద్రంలో ఓ వ్యక్తి ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకోవాలని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు డీజీపీకి లేఖ రాశారు. 

గుంటూరు జిల్లా దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం అయ్యిందని, మళ్లీ అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీకి మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు లేఖ రాశారు. ఆదివారం నాడు దుర్గిలో అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీ శెట్టిపల్లి యలమంద కుమారుడు కోటేశ్వర్ రావ్ ఎన్టీఆర్ విగ్ర‌హంపై దాడి చేశాడ‌ని ఆరోపించారు. ఇలా చేయ‌డం వివిధ వర్గాల ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చ‌గొట్ట‌డ‌మే అవుతుంద‌ని తెలిపారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌ళ్లీ జ‌రిగితే ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ‌వ‌చ్చ‌ని చెప్పారు. 

జగన్ ఢిల్లీ పర్యటన : బెయిల్ అంశంపై మాట్లాడడానికే మోదీతో భేటీ..రఘురామ వ్యంగ్యాస్త్రాలు

ఏపీలో వైసీపీ 2019లో అధికారం చేప‌ట్టింద‌ని, అప్ప‌టి నుంచే రాష్ట్రంలో వ‌రుస‌గా ఇలాంటి ఘ‌ట‌నలు జ‌రుగుతున్నాయ‌ని అన్నారు. వైసీపీ నాయ‌కులు ఆదేశాల మేర‌కే ఇవి జ‌రుగుతున్నాయ‌ని ఆదివారం చోటు చేసుకున్న ఘ‌ట‌నే నిద‌ర్శ‌మ‌ని ఆరోపించారు.  వైసీపీ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తోంద‌ని అన్నారు. అందుకే జాతీయ నాయకులైన ఎన్టీఆర్, డా. బి.ఆర్‌ అంబేడ్కర్, పొట్టి శ్రీరాములు వంటి మ‌హానుభావుల విగ్ర‌హాలు ధ్వంసం చేస్తుంద‌ని తెలిపారు. ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డే వారికి పోలీసులు స‌హ‌క‌రిస్తున్నార‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో వ్య‌క్త‌మవుతోంద‌ని ఆరోపించారు. 

శాంతియుతంగా నిర‌స‌న‌లు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకోవ‌డం మానేసి, ఇలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల‌ని అన్నారు. మ‌ళ్లీ ఇలాంటి విధ్వంసాలు జ‌ర‌గ‌కుండా నియంత్రించాల‌ని  తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో హ‌స్తం ఉన్న‌వారిపై పోలీసులు స‌మ‌గ్ర‌మైన విచార‌ణ జ‌రిపి దోషులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చూడాల‌ని అన్నారు. నేర‌స్తుల‌పై పోలీసులు తీసుకునే కఠినమైన చ‌ర్య‌లే, మ‌ళ్లీ ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చూస్తాయ‌ని ఆయ‌న లేఖ‌లో అభిప్రాయ‌ప‌డ్డారు. 

ఎన్టీఆర్ విగ్రహంపై దాడి ఎఫెక్ట్... అధికార వైసిపి షాక్... పార్టీకి, పదవికి కీలక నేత రాజీనామా (Video)


అస‌లేం జ‌రిగిందంటే...
గుంటూరు జిల్లాలోని దుర్గిలో దివంగ‌త సీఎం ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఓ వ్య‌క్తి ధ్వంసం చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడు. దాడి చేసిన వ్య‌క్తి  వైసీపీ నాయ‌కుడు, దుర్గి మార్కెట్‌యార్డ్ మాజీ ఛైర్మన్ యలమంద కుమారుడు కోటేశ్వరరావు గా గుర్తించారు. ఈ ఘ‌ట‌న ఆదివారం సాయంత్రం జ‌రిగింది. మండల కేంద్రమైన దుర్గిలోని బస్టాండ్ స‌మీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని అత‌డు సుత్తితో ప‌గ‌ల‌గొట్టాని ప్ర‌య‌త్నించాడు. దీంతో విగ్ర‌హం కొంత దెబ్బతింది. ఈ ఘ‌ట‌న అంతా కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. దీంతో ఆ వీడియో ఫుటేజ్ సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారాయి. పోలీసులు అక్క‌డికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ప్ర‌తిప‌క్ష టీడీపీ భ‌గ్గుమంది. 

ఆ పార్టీ జాతీయ‌ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ ఘ‌ట‌న‌పై మాట్లాడారు. మ హనీయుల విగ్రహాలు ధ్వంసానికి ప్రయత్నించడం దారుణమని వ్యాఖ్యానించారు. వైకాపా నేత కోటేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయ‌డంపై టీపీడీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు.  వైకాపా కార్యకర్త ధ్వంసం చేయడాన్ని తప్పుబట్టారు. మద్యం మత్తులో చేసిన ప‌నికాద‌నీ, కావాల‌నే ఉద్దేశ‌ప్వూరంగా చేసిన దాడి అని ఆక్షేపించారు. ఈ ఘ‌ట‌న ఏపీ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం కావ‌డంతో రూరల్ ఎస్పీ విశాల్ గున్ని స్పందించారు. విగ్రహంపై దాడి చేసిన కోటేశ్వరరావును అరెస్టు చేయాలని సంబంధిత పోలీసులను ఆదేశించారు.  ఘటన‌పై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని గురజాల డీఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే