మూడు రాజధానుల విషయమై ఏపీ సీఎం వైఎస్ జగన్ కు మెగాస్టార్ చిరంజీవి మద్దతు పలికి తన ఇద్దరు సోదరులకు షాకిచ్చారు.
అమరావతి: ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి జై కొట్టారు. కానీ, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మాత్రం నై అన్నారు. చిరంజీవి మరో సోదరుడు నాగబాబు మూడు రాజధానుల ప్రతిపాదనకు నిరసనగా రైతులు చేస్తున్న ఆందోళనలో ఆయన పాల్గొన్నారు.ఇద్దరు సోదరులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే చిరంజీవి మాత్రం సమర్ధించడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
Alsoread:ఏపీకి మూడు రాజధానులు: పవన్‌కు షాకిచ్చిన చిరు, జగన్ జై
ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని ఏపీ సీఎం జగన్ ఈ నెల 17వ తేదీన అసెంబ్లీలో సంకేతాలు ఇచ్చారు. ఈ సంకేతాలకు నిరసనగా అమరావతి పరిసర ప్రాంతాల్లో ఆందోళనలు సాగుతున్నాయి.
Also read: రాజధానిపై బోస్టన్ కమిటీ మధ్యంతర నివేదిక ఇదీ...
ఈ నెల 20వ తేదీన అమరావతి ప్రాంతంలో జనసేన నేత నాదెండ్ల మనోహార్, చిరంజీవి సోదరుడు నాగబాబులు స్వయంగా రైతుల ఆందోళన కార్యక్రమంలో పాల్గొని వారికి మద్దతు ప్రకటించారు.
Also read:చిరంజీవితో భేటీ: పవన్ కల్యాణ్ కు వైఎస్ జగన్ చెక్
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని నాగబాబు డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంత రైతుల ఉసురు పోసుకోకూడదని జగన్ కు హితవు పలికారు. ముఖ్యంగా మహిళలను బాధ పెట్టకూడదని నాగబాబు కోరారు. రాజధాని రైతాంగానికి తమ పార్టీ అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ తరపున వీరిద్దరూ హామీ ఇచ్చారు.
Also read:రాజధానిపై జీఎన్ రావు కమిటీ: అమరావతిలో కొనసాగుతున్న ఆందోళనలు, ఉద్రిక్తత
అయితే మెగా ఫ్యామిలీలో నాగబాబు, పవన్ కళ్యాణ్‌లు మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించారు. అయితే వివాదాస్పద నిర్ణయాలు, ప్రకటనలపై స్పందించేందుకు దూరంగా ఉండే చిరంజీవి మాత్రం శనివారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు.
Also read:నివేదికపై భగ్గుమన్న అమరావతి.. జగన్‌ది అన్యాయమంటూ నినాదాలు
ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను సమర్ధించారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణతో ప్రయోజనమని చిరంజీవి అభిప్రాయపడ్డారు. తెలుగు సినీ రంగంలో మెగాస్టార్ చిరంజీవికి అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అంశాన్ని చిరంజీవి సమర్ధిస్తూ లేఖ రాయడం...ఈ లేఖను మీడియాకు విడుదల చేయడం ప్రస్తుతం చర్చకు దారితీసింది.
Also Read:అమరావతి కుదింపు, వికేంద్రీకరణ ప్లాన్ ఇదీ: జీఎన్ రావు
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు చిరంజీవి లేఖ రాసి మీడియాకు విడుదల చేసిన సమయంలోనే జీఎన్ రావు కమిటీ నివేదికను నిరసిస్తూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడ మీడియాకు ప్రకటనను విడుదల చేశాడు. యాధృచ్ఛికంగా ఈ రెండు ప్రకటనలు కూడ ఒకే సమయానికి వచ్చాయి.
కొన్ని రోజుల క్రితం చిరంజీవి కుటుంబసభ్యులు ఏపీ సీఎం వైఎస్ జగన్ కుటుంబసభ్యుల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడినట్టుగా తెలుస్తోంది.సైరా సినిమాకు ముందు ఈ కుటుంబాల మధ్య సంబంధాలు ఏర్పడినట్టుగా చెబుతున్నారు.
ఈ పరిచయాలతోనే చిరంజీవి సైరా సినిమాను చూడాలని ఏపీ సీఎం జగన్ ను కోరినట్టుగా చెబుతున్నారు. సైరా సినిమా చూసేందుకు ఆహ్వానించేందుకు వెళ్లిన చిరంజీవి దంపతులతో కలిసి జగన్ దంపతులు కలిసి భోజనం చేశారు.
జగన్ నిర్ణయాలను సందర్భాన్ని బట్టి చిరంజీవి మద్దతు పలుకుతున్నారు. అయితే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మాత్రం జగన్ తీసుకొన్న నిర్ణయాలపై ఒంటికాలిపై లేస్తున్నారు. ఏపీలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై జగన్‌పై పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్‌పై జగన్ వ్యక్తిగత విమర్శలు కూడ చేశారు.
చిరంజీవి చేసిన ప్రకటన రాజకీయంగా పవన్ కళ్యాణ్‌కు కొంత ఇబ్బంది కల్గించే అవకాశాలను కొట్టిపారేయలేమనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. అయితే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తిగా లేరు. ఆసక్తి ఉన్నంత కాలం సినిమా రంగంలో కొనసాగేందుకు ఆయన ఉత్సాహంగా ఉన్నారని చెబుతున్నారు.
ఈ తరుణంలో చిరంజీవి ప్రకటన రాజకీయంగా జగన్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే మెగాస్టార్ ప్రకటన రాజకీయంగా పవన్ కళ్యాణ్‌కు దెబ్బే అనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
ఏపీకి మూడు రాజధానుల విషయంలో మెగా కుటుంబంలో నాగబాబు, పవన్ కళ్యాణ్ ఒకవైపు నిలబడితే, చిరంజీవి మాత్రం జగన్ వైపు నిలబడ్డాడు. చిరంజీవి ప్రకటన రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఏ రకమైన ప్రకంపనలకు కారణమౌతోందో చూడాలి.