
కర్నూలు : ఏపీలోని కర్నూలులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ మెడికో ఆత్మహత్య చేసుకున్నాడు. విశ్వభారతి మెడికల్ కాలేజీలో ఉరివేసుకుని లోకేష్ అనే మెడిసిన్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. లోకేష్ మెడిసిన్ థార్డ్ ఇయర్ చదువుతున్నాడు. విషయం తెలియడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు లోకేష్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.