
తన ఒంటిపై చేయి పడితే ... జనసేన ప్రభుత్వం వచ్చాక వైసీపీ గూండాలను ఇళ్లలోంచి లాక్కొచ్చి మరీ కొడతామని హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో జరిగిన వారాహి విజయ యాత్రలో ఆయన ప్రసంగిస్తూ.. తనకు జెడ్ కేటగిరి సెక్యూరిటీ అక్కర్లేదన్నారు. తన ఒంటిపై రాయిపడితే తానేంటో చూపిస్తానని హెచ్చరించారు. పాతిక సంవత్సరాల యుద్ధానికి సిద్ధపడి తనతో గొడవ పడాలన్నారు. వైసీపీ నేతలు వివిధ ప్రాంతాల నుంచి క్రిమినల్స్‌ను తీసుకొచ్చుకుంటున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. సొంత బాబాయిని చంపుకుని మాకు ఏం తెలియదంటే ఎలా అంటు పవన్ దుయ్యబట్టారు.
రోడ్డు మీద ఎలా తిరుగుతావో చూస్తామని వైసీపీ నేతలు అంటున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రౌడీలకు భయపడే రకం కాదు.. విప్లవకారుడినని పేర్కొన్నారు. మీరు రౌడీలను చూసి వుంటారు కానీ, విప్లవ పంథాలో వున్న రాజకీయ నాయకుడిని చూసి వుండరని వ్యాఖ్యానించారు. అంతర్వేదిలో రథం కాలిపోతే పిచ్చోడు చేశాడని అన్నారని .. అగ్ని క్షత్రియ కులానికి చెందిన ఓ వ్యక్తి 1800 ఎకరాలను లక్ష్మీనరసింహస్వామికి ఇచ్చారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ఏపీలోనే అంతర్వేది పెద్ద రథమని దానిని వైసీపీ క్రిమినల్స్ కాల్చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశరాు