చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ పేలుడు.. భార్యాభర్తల పరిస్థితి విషమం...

Published : Jun 26, 2023, 07:16 AM IST
చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ పేలుడు.. భార్యాభర్తల పరిస్థితి విషమం...

సారాంశం

చిత్తూరు జిల్లాలో జరిగిన భారీ పేలుడులో భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. 

చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కుప్పంలో భారీ పేలుడు కలకలం రేపింది. ఓ ఇంట్లో నాటుబాంబు పేలడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో ఆ ఇంట్లోని మురుగేష్, ధనలక్ష్మి దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. అయితే,  వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. 

పేలుడు సమాచారం తెలియడంతో ఘటనా స్థలికి చేరుకన్న పోలీసులు పేలుళ్లపై దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు కారణం నాటుబాంబులా, జిలెటిన్ స్టిక్సా అనేది తేలాల్సి ఉందన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిముందు నాటుబాంబులు పేల్చినట్లు సమాచారం. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యింది. వీరిని టార్గెట్ చేసే పేలుళ్లకు పాల్పడ్డారా? లేక ఇంకేదైనా కారణముందా? తేలాల్సి ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?