గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ

By narsimha lodeFirst Published Sep 23, 2018, 2:46 PM IST
Highlights

 మావోయిస్టులు కాల్పులు జరిపిన ఘటనలో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి చెందినట్టు  విశాఖ రేంజ్ డీఐజీ శ్రీకాంత్ చెప్పారు.
 

విశాఖపట్టణం: మావోయిస్టులు కాల్పులు జరిపిన ఘటనలో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి చెందినట్టు  విశాఖ రేంజ్ డీఐజీ శ్రీకాంత్ చెప్పారు.

ఆదివారం నాడు మధ్యాహ్నాం విశాఖపట్టణంలోని తన కార్యాలయంలో ఎస్పీ కార్యాలయంలో ఆయన  మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే ‌గన్‌మెన్ల వద్ద ఉన్న రెండు 9 ఎంఎం పిస్టల్, కార్బన్ ను కూడ మావోయిస్టులు తీసుకెళ్లారని డీఐజీ చెప్పారు.

సుమారు  20 మంది మావోయిస్టులు, స్థానికులు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను చుట్టుముట్టారని డీఐజీ చెప్పారు. ఆ తర్వాత ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమపై దాడికి పాల్పడ్డారని ఎస్పీ చెప్పారు. ఈ ఘటనలో  ఎమ్మెల్యే సర్వశర్వరావు, మాజీ ఎమ్మెల్యే సోమ అక్కడికక్కడే మృతి చెందారని ఆయన చెప్పారు.

సంఘలనస్థలంలో సెల్‌పోన్ సిగ్నల్స్ పనిచేయడం లేదన్నారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు తమకు అందిన సమాచారాన్ని చెబుతున్నట్టు డీఐజీ చెప్పారు. ఈ ఘటన జరిగిన ప్రాంతం ఒడిశా సరిహద్దుకు 15కి.మీ దూరంలోనే ఉందన్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే  సోమ మృతదేహలను కేజీహెచ్ కు తరలిస్తున్నట్టు ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే

click me!