గన్ మెన్ ను చెట్టుకు కట్టేసి ఎమ్మెల్యేను చంపిన మావోలు

Published : Sep 23, 2018, 02:23 PM IST
గన్ మెన్ ను చెట్టుకు కట్టేసి ఎమ్మెల్యేను చంపిన మావోలు

సారాంశం

సర్వేశ్వర రావుకు రక్షణగా ఇద్దరు గన్ మెన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు గన్ మెన్ ను మావోయిస్టులు పట్టుకుని వారిని చెట్టుకు కట్టేసి వారి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.

విశాఖపట్నం: పకడ్బందీగా మావోయిస్టులు శాసనసభ్యుడు సర్వేశ్వర రావుపై దాడి చేసినట్లు కనిపిస్తోంది. సర్వేశ్వర రావు ప్రయాణిస్తున్న వాహనంపై మావోయిస్టులు దాడి చేసినట్లు తెలుస్తోంది. సర్వేశ్వర రావును, సోమను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత 30 నిమిషాల పాటు వారితో మావోయిస్టులు మాట్లాడినట్లు సమాచారం.

సర్వేశ్వర రావుకు రక్షణగా ఇద్దరు గన్ మెన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు గన్ మెన్ ను మావోయిస్టులు పట్టుకుని వారిని చెట్టుకు కట్టేసి వారి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత సర్వేశ్వర రావుతో దాదాపుగా అర గంటపాటు మావోయిస్టులు మాట్లాడారని అంటున్నారు. 

సర్వేశ్వర రావుపై యాభై మావోయిస్టులు దాడి చేసినట్లు చెబుతున్నారు. వారంతా మహిళా మావోయిస్టులేననే వార్తలు వస్తున్నాయి. అయితే, 50 మందిలో 40 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్లు చెబుతున్నారు. 

పాయింట్ బ్లాంక్ రేంజ్ లో సర్వేశ్వరరావుపై, సోమపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు పర్యటనపై తమకు సమాచారం లేదని పోలీసులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి

PREV
click me!

Recommended Stories

వొళ్ళు గగురు పుట్టే విన్యాసాలతో అదరగొట్టిన పోలీస్ సిబ్బంది | Nara Lokesh | Independence Day | Stunts
ఈ బైకర్ విన్యాసాలకి మంత్రి నారా లోకేష్ ఫిదా | Nara Lokesh Particepate Independence Day Celebrations