జ్యోతి హత్య కేసు: పోలీసుల తీరుపై అనుమానాలు

Published : Feb 13, 2019, 03:36 PM IST
జ్యోతి హత్య కేసు: పోలీసుల తీరుపై అనుమానాలు

సారాంశం

అమరావతి టౌన్‌షిప్‌ సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన జ్యోతి కేసులో మంగళగిరి పోలీసులు నిర్లక్ష్యంగావ్యవహరించారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు


మంగళగిరి: అమరావతి టౌన్‌షిప్‌ సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన జ్యోతి కేసులో మంగళగిరి పోలీసులు నిర్లక్ష్యంగావ్యవహరించారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

రెండు రోజుల క్రితం అమరావతి టౌన్‌షిప్‌లో  జ్యోతి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది.  మృతి చెందిన రోజున జ్యోతి ధరించిన వస్త్రాలను పోలీసులు సేకరించలేదు.

పోస్ట్‌మార్టం తర్వాత జ్యోతి ఒంటిపై ఉన్న దుస్తులను పోలీసులు  సేకరించలేదు. శాస్త్రీయ ఆధారాలను సేకరించేందుకు గాను  ఈ దుస్తులు కీలకమైన ఆధారాలు కానున్నాయి. కానీ, పోస్ట్ మార్టం తర్వాత  దుస్తులను సేకరించకుండానే పోలీసులు జ్యోతి మృతదేహన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

బుధవారం ఉదయం నుండి మంగళగిరి పోలీసులు జ్యోతి ఒంటిపై ఉన్న దుస్తుల కోసం మరోసారి ఒత్తిడి తీసుకొచ్చారు.  దీంతో జ్యోతి సోదరుడు ప్రభాకర్ తన సోదరి మృత దేహాన్ని వెలికి తీయించి శరీరంపై ఉన్న దుస్తులు, వాచీని పోలీసులకు అప్పగించారు ఈ విషయాన్ని మీడియాకు  చెప్పకుండా ఉండాలని ప్రభాకర్ కు  పోలీసులు సూచించారు.

 

సంబంధిత వార్తలు

శ్రీనివాస్ బైక్‌పై జ్యోతి: సీసీటీవీ కెమెరాకు చిక్కిన దృశ్యం

అమరావతి రేప్, హత్య కేసులో సంచలనం: ప్రియుడిపైనే అనుమానాలు

ప్రియుడి ముందే ప్రేయసిపై రేప్: దాడి, యువతి మృతి

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే