రాజధాని నిర్మాణంలో అక్రమాలు.. అవసరమైతే లండన్ కోర్టుకు: ఆర్కే

Siva Kodati |  
Published : Jun 19, 2019, 06:16 PM IST
రాజధాని నిర్మాణంలో అక్రమాలు.. అవసరమైతే లండన్ కోర్టుకు: ఆర్కే

సారాంశం

రాజధాని అమరావతి రైతులు టీడీపీ ప్రభుత్వ హయాంలో చిత్రహింసలకు గురయ్యారన్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

రాజధాని అమరావతి రైతులు టీడీపీ ప్రభుత్వ హయాంలో చిత్రహింసలకు గురయ్యారన్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. తుళ్లూరు మండలం రాయపూడిలో రాజధాని రైతుల సమావేశంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడుతూ.. రాజధానిలో జరిగిన అక్రమాలపై విచారణ చేపడతామని.. అవసరమైతే సీబీఐ విచారణ కూడా కోరతామని ఆర్కే తెలిపారు. అక్రమాలకు పాల్పడిన అధికార పార్టీ నాయకులపై తప్పకుండా  చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

స్విస్ ఛాలెంజ్‌ పై అవసరమైతే లండన్ కోర్టుకైనా వెళ్తామని ఆర్కే స్పష్టం చేశారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ.. చదరపు అడుగుకు రూ.2 వేలు కూడా ఖర్చు కాని తాత్కాలిక సచివాలయానికి రూ. 10 వేలకు పైగా ఖర్చు పెట్టి వేల కోట్లు దోపిడి చేశారని శ్రీదేవి ఆరోపించారు.

జగన్ హయాంలో రాజధాని ఇక్కడ ఉండదని టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు అమరావతి మీద అంత ప్రేమ ఉంటే ఇక్కడే ఇల్లు ఎందుకు కట్టుకోలేదని శ్రీదేవి ప్రశ్నించారు. 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu