అనిల్ కు ఇరిగేషన్ శాఖ అందుకే: సీఎం జగన్ పై టీడీపీ సెటైర్లు

By Nagaraju penumalaFirst Published Jun 19, 2019, 5:49 PM IST
Highlights

టీడీపీ హయాంలో నీరు-చెట్టు పనుల్లో అవినీతి జరిగిందని ఘోషిస్తున్న మంత్రి అనిల్‌ కుమార్‌కు చిత్తశుద్ధి ఉంటే జిల్లాకు చెందిన ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కనుసన్నల్లో జరిగిన పనులపై ముందుగా విచారణ చేపట్టాలని సవాల్ విసిరారు. వారిపై విచారణ జరిపే ధైర్యం మీకుందా అంటూ నిలదీశారు. 

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో అనిల్ కుమార్ యాదవ్ కు బెర్త్ దక్కడంపై నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. అనిల్ కుమార్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి బినామీ అంటూ ఆరోపించారు. 

బినామీ కాబట్టి అణిగిమణిగి ఉంటారని అందువల్లే కీలకమైన జలవనరుల శాఖను కట్టబెట్టారని విమర్శించారు. అంతే తప్ప అనిల్ కుమార్ యాదవ్ కు ఏ అర్హత ఉందని అంతటి కీలక శాఖ కట్టబెడతారని టీడీపీ నేతలు నిలదీశారు. 

అసెంబ్లీలో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ వ్యవహరించిన తీరు వీధిరౌడీని తలపిస్తోందంటూ విరుచుకుపడ్డారు. ఇరిగేషన్ శాఖపై ఎలాంటి అవగాహనలేని అనిల్‌కుమార్‌కు ఆశాఖ ఇవ్వడం వెనుక పెద్ద వ్యూహమే ఉందన్నారు.  

టీడీపీ హయాంలో నీరు-చెట్టు పనుల్లో అవినీతి జరిగిందని ఘోషిస్తున్న మంత్రి అనిల్‌ కుమార్‌కు చిత్తశుద్ధి ఉంటే జిల్లాకు చెందిన ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కనుసన్నల్లో జరిగిన పనులపై ముందుగా విచారణ చేపట్టాలని సవాల్ విసిరారు. వారిపై విచారణ జరిపే ధైర్యం మీకుందా అంటూ నిలదీశారు. 

మాజీ సీఎం చంద్రబాబు నాయుడును విమర్శించే అర్హత మంత్రి అనిల్ కుమార్ కు లేదన్నారు. ఇకపై అనిల్ తనకు ఉన్న అర్హతను గుర్తెరిగి ప్రవర్తించాలని సూచించారు. నీరుచెట్టు పనుల్లో అవినీతిని చూపిస్తే తాము ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతనిధి మురళీ కన్నబాబు.  
 
click me!