ఏపీకి వాన గండం (rain alert for ap) వెంటాడుతూనే వుంది. చిత్తూరు, నెల్లూరు, అనంతపురం సహా కోస్తాంధ్రలోనూ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ (imd) ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలో వర్షాలు, వరదలపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) సమీక్ష (review meeting) నిర్వహించారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల కలెక్టర్లతో సమీక్ష చేసిన సీఎం సహాయక చర్యల్లో వేగం పెంచాలని ఆదేశించారు.
ఏపీకి వాన గండం (rain alert for ap) వెంటాడుతూనే వుంది. చిత్తూరు, నెల్లూరు, అనంతపురం సహా కోస్తాంధ్రలోనూ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ (imd) ప్రకటించింది. రాయలసీమలో (rayalaseema) ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం వుందని తెలిపింది. ఈ నెల 26 తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం చెబుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో చెరువులు, వాగులు, వంకలు పొంగి పోర్లుతున్నాయి. వర్షాలతో నీటి మట్టం మరింత పెరగనుంది. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
మరోవైపు రాష్ట్రంలో వర్షాలు, వరదలపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) సమీక్ష (review meeting) నిర్వహించారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల కలెక్టర్లతో సమీక్ష చేసిన సీఎం సహాయక చర్యల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఇళ్లు కూలిపోయిన వారిని పునరావాస శిబిరాలకు తరలించడంతో పాటు ఆహారం, తాగునీటిని వరద బాధితులకు అందుబాటులో వుంచాలని ఆదేశించారు. ఇక నాలుగు జిల్లాల్లో జరిగిన వరద నష్టాన్ని సీఎం జగన్‌కు వివరించారు అధికారులు. వర్షాల వల్ల వ్యవసాయ రంగానికి రూ.1353 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. లక్షా 42 వేలకు పైగా ఎకరాల్లో పంట నష్టమైందని చెప్పారు. రహదారులు పాడవ్వడం వల్ల జరిగిన నష్టం రూ.1756 కోట్లని అంచనా వేశారు. అలాగే డ్యాములు, సాగునీటి శాఖకు జరిగిన నష్టం అంచనా 556 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు.
Also Read:AP Floods: ఏపీలో పంట నష్టం, పరిహారం లెక్కలు ఇవి.. అసెంబ్లీలో మంత్రి కన్నబాబు ప్రకటన
కాగా.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తుఫాను, వరద నష్టంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ప్రకటన చేశారు. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలో నష్ట తీవ్రత ఎక్కువగా వుందని కన్నబాబు వెల్లడించారు. ఈ బాధిత ప్రాంతాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించిందని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ (cm ys jagan) ప్రతిరోజూ పరిస్ధితులను సమీక్షిస్తున్నారని.. ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైందని, తిరిగి సాధారణ పరిస్ధితులను తీసుకురావానికి అన్ని విధాలా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సమీక్షలు నిర్వహించడంతో పాటు ఈరోజు కేబినెట్‌లో (ap cabinet) దీనిపై సుదీర్ఘంగా చర్చించామని వ్యవసాయ శాఖ మంత్రి పేర్కొన్నారు.
ఎన్ని వ్యయ ప్రయాసలు ఎదురైనా సరే సాధారణ పరిస్ధితులు నెలకొల్పేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా నిమగ్నం కావాలని సీఎం ఆదేశించారని కన్నబాబు చెప్పారు. వర్షాల కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 34 మంది ప్రాణాలు కోల్పోయారని.. మరో 10 మంది గల్లంతయ్యారని.. వారి ఆచూకీ తెలియాల్సి వుంది. చనిపోయిన వారిలో ముగ్గురు రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమైన ఉద్యోగులు కూడా వున్నారని వ్యవసాయ మంత్రి పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే చనిపోయిన 90 శాతం మంది కుటుంబాలకు పరిహారం అందజేశామని ఆయన సభకు వివరించారు.