పవన్ కల్యాణ్ కు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సెగ

By pratap reddyFirst Published 18, Aug 2018, 8:13 AM IST
Highlights

కాపు రిజర్వేషన్లపై వైఖరిని స్పష్టం చేసిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సెగ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. 

ఒంగోలు: కాపు రిజర్వేషన్లపై వైఖరిని స్పష్టం చేసిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సెగ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై వైఖరిని స్పష్టం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పవన్ కల్యాణ్ ను డిమాండ్ చేశారు.

సామాజిక న్యాయం సాధిస్తాననని చెబుతున్న పవన్‌కల్యాణ్‌ ఎస్సీ వర్గీకరణకు అనుకూలమో, వ్యతిరేకమో స్పష్టంచేయాలని ఆయన అడిగారు. వర్గీకరణపై ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయాన్ని ప్రకటించాయని, జనసేన కూడా తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన అన్నారు. 

ప్రకాశం జిల్లా ఒంగోలులో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై అధికార పక్షం హామీ ఇచ్చి మోసం చేసిందని, ప్రతిపక్షం మౌనంగా ఉండి అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు.
 
కాపులకు రిజర్వేషన్లను బీసీలు వ్యతిరేకించడంతో బీసీల రిజర్వేషన్‌ పెంపుపై పార్లమెంట్‌లో మాట్లాడతానని అనడం ఎంత వరకు సమంజసమని ఆయన అన్నారు. పవన్‌ సామాజిక న్యాయం పేరుతో కేవలం కాపులను మాత్రమే నెత్తికెక్కించుంటున్నారని అన్నారు.

Last Updated 9, Sep 2018, 11:50 AM IST