అనంతలో ప్రియుడితో భార్య జంప్: ఆత్మహత్యాయత్నానికి వెళ్లిన భర్త, చివరి నిమిషంలో

By narsimha lode  |  First Published May 18, 2022, 12:06 PM IST

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను, ముగ్గురు పిల్లలను వదిలి ప్రియుడితో పారిపోయింది వివాహిత. అయితే భార్య ఇంటి నుండి పారిపోవడంతో భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉమ్మడి అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
 



అనంతపురం:ప్రేమించి పెళ్లి చేసుకున్నభర్తను కాదని వివాహిత ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో ఈ భర్త Suicide Attempt పాల్పడ్డాడు.  ఈ ఘటన ఉమ్మడి అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

శ్రీసత్యసాయి జిల్లా Hindupur మండలం మలుగూరుకు చెందిన Srinivasulu  పదేళ్ల క్రితం కొత్త చెరువుకు చెందిన Lavanyaలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. అయితే కొంత కాలంగా లావణ్య తన స్వంత సామాజిక వర్గానికి చెందిన  Srinivas Reddy తో  Extra Marital Affair ఏర్పాటు చేసుకుంది.  ప్రియుడితో కలిసి భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. దీంతో పద్దతిని మార్చుకోవాలని భర్త హెచ్చరించారు.  కానీ ఆమె తన పద్దతిని మార్చుకోలేదు. ప్రియుడితో కలిసి లావణ్య ఇంటి నుండి నెలన్నర రోజుల క్రితం వెళ్లిపోయింది.

Latest Videos

నెలన్నరగా పోలీస్ స్టేషన్ చుట్టూ శ్రీనివాసులు తిరుగుతున్నాడు. అయితే తనకు  న్యాయం జరక్కపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. ఏం చేయాలో తెలియక ముగ్గురు పిల్లల్ని తీసుకొని వెళ్లి Puttaparthi ఎయిర్ పోర్టు వద్ద వదిలేశాడు. అనంతరం ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లాడు. ఐతే స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో పిల్లల్ని రక్షించారు. ఐతే ఆప్పటికే ఆత్మహత్య చేసుకుందామని రైలు పట్టాలపై పడుకున్న శ్రీనివాస్ చివరి నిముషంలో పిల్లలు గుర్తొచ్చి మళ్లి తీరిగొచ్చాడు.

తాను పిల్లల్ని పోషించలేక వదలిపెట్టి వెళ్లలేదని భార్య చేసిన పనికి మనస్తాపంతోనే అలా చేశానని చెప్పాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లినా న్యాయం జరగకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు తెలిపాడు. పిల్లల్ని ఎవరైనా పెంచుకుంటారనే ఉద్దేశంతోనే ఎయిర్ పోర్టు వద్ద వదిలి వెళ్లినట్లు వివరించాడు. శ్రీనివాసులు చివరి నిముషంలో మనసు మార్చుకోకపోతే ఆ పిల్లలు ఒంటరివారయ్యేవారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య దారుణంగా మోసం చేయడంతో తట్టుకోలేకపోయానని శ్రీనివాసులు తెలిపాడు. 
 

click me!