స్మశానంలో రాళ్లతో కొట్టి వ్యక్తి హత్య... విచిత్రమైన ముగ్గులు, తాంత్రిక పూజలు...!

Published : Aug 25, 2022, 01:54 PM IST
స్మశానంలో రాళ్లతో కొట్టి వ్యక్తి హత్య... విచిత్రమైన ముగ్గులు, తాంత్రిక పూజలు...!

సారాంశం

సత్యసాయి జిల్లాలో అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. అది స్మశానంలో జరగడం.. అక్కడ విచిత్రమైన ముగ్గులు, తాంత్రిక పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడం స్థానికంగా భయాందోళనలు రేపుతోంది. 

శ్రీ సత్యసాయి జిల్లా : ఆస్తులు కలిసి వస్తాయని, గుప్త నిధులు లభిస్తాయని.. ముక్తి పొందుతామని.. అతీంద్రియ శక్తులు వస్తాయని.. ఇలా అనేక రకాల కారణాలతో మూఢనమ్మకాల్ని బలంగా విశ్వసించడం తరచుగా మనకు కనిపిస్తూనే ఉంది. దీనికోసం మానవ సంబంధాలు, మానవత్వం మరిచిపోయి దారుణానికి తెగబడడమూ తెలిసిందే. మనిషి చంపడానికి, అత్యాచారాలు చేయడానికి కూడా వెనకాడరు. అలా మూఢనమ్మకాలతో మంత్ర తంత్రాలు, చేతబడి పేరుతో పైశాచికాలకు పాల్పడుతున్నారు కొంతమంది. ఈ నేపథ్యంలో ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడటం లేదు. 

ఇలాంటి ఘటనలు ఇప్పటికే అనేకం చూశాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్య సాయి జిల్లాలో ఇదే తరహా ఘటన ఒకటి వెలుగుచూసింది.  మామూలుగా ఎవరైనాసరే... వ్యక్తి చనిపోయిన తర్వాత అంత్యక్రియల కోసం స్మశానానికి తీసుకు వెళతారు. కానీ, స్మశానానికి తీసుకువెళ్ళిన తర్వాతే ఓ వ్యక్తిని చంపేశారు. అయితే, గుప్తనిధుల కోసం ఈ దారుణానికి తెగ పడ్డారని.. స్థానికులు చెబుతున్నారు. చెరువు మరవపల్లికి సమీపంలో ఈ ఘటన జరిగింది. చనిపోయిన వ్యక్తిని నాగార్జునరెడ్డి అని గుర్తించారు.  

హిందూపురంలో వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి.. వీడిన మిస్టరీ, ప్రియుడే హంతకుడు..

అతని మీద అతి కిరాతకంగా రాళ్లతో దాడిచేసి చంపేశారు. ఈ హత్య జరిగిన స్థలానికి దగ్గర్లో విచిత్రమైన ముగ్గులు వేయడంతోపాటు.. తాంత్రిక పూజలు చేసిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. దీంతో అతీత శక్తులు, గుప్తనిధుల కోసం ఈ హత్య జరిగినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ సహాయంతో వివరాలు సేకరించారు. పూర్తి సమాచారం సేకరిస్తున్నామని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోందా? ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదా?
Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu