పల్నాడులో దారుణం : ఆస్తి తగాదాలతో తల్లిని, చెల్లిని ఇనుపరాడ్డుతో కొట్టి చంపిన కిరాతకుడు

Siva Kodati |  
Published : Jul 05, 2023, 08:30 PM IST
పల్నాడులో దారుణం : ఆస్తి తగాదాలతో తల్లిని, చెల్లిని ఇనుపరాడ్డుతో కొట్టి చంపిన కిరాతకుడు

సారాంశం

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో డబుల్ మర్డర్ చోటు చేసుకుంది. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తి తల్లిని, చెల్లిని దారుణంగా హత్య చేశాడు. 

పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో డబుల్ మర్డర్ చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఖాసీం అనే వ్యక్తి తల్లి, చెల్లిని దారుణంగా హత్య చేశాడు. మృతులను రహీమున్ (65), మౌలాబీగా (65)గా గుర్తించారు. రహీమున్ భర్త కొన్నాళ్ల క్రితం మరణించాడు. దీంతో ఆమె కొంతకాలంగా కుమార్తె మౌలాబీతో కలిసి నివసిస్తోంది. అయితే వీరికి రెండెకరాల భూమికి సంబంధించి ఖాసీంతో తగాదాలు వున్నాయి. ఈ నేపథ్యంలో ఖాసీం బుధవారం సాయంత్రం తన కొడుకుతో కలిసి ధూళిపాళ్లలోని రహీమున్ ఇంటికి వెళ్లి.. రహీమున్, మౌలాబీలపై ఇనుప రాడ్డుతో దాడి చేసి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది .

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం