దారుణం : బతికుండగానే పసికందు పూడ్చివేత...!

Published : Jul 10, 2021, 10:28 AM IST
దారుణం : బతికుండగానే పసికందు పూడ్చివేత...!

సారాంశం

ఆస్పత్రి వర్గాలు చనిపోయిన బిడ్డను పాతి పెట్టేయాలని కొందరికి పని అప్పగించాయి. వారు గొయ్యి తవ్వుతుండగా బిడ్డ కదలడం చూసి ఆశ్చర్యపోయారు.

శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తల్లి గర్భం నుంచి నేరుగా స్మశానికి చేరుకుందో శిశువు. తల్లిపొత్తిళ్లలో ఊపిరి పోసుకోవాల్సిన ఆ చిన్నారి. స్మశానపు మట్టిలో ఊపిరాడక అసువులు బాసింది. 

ఏ వైద్యుడు పరీక్షించి పుట్టిన శిశువు మృతి చెందినట్లు ప్రకటించాడో, ఏమని రిపోర్ట్ ఇచ్చారో తెలీదు గానీ.. కళ్లయినా తెరవని పసికందు కొనప్రాణంతో ఉండగానే కాటికి చేరాడు. అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన బుజ్జాయి గుడ్డ ముక్కలతో చుట్టి మట్టిలో పాతి పెట్టాని పురమాయించారు. 

పలాసలో శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. 

ఆస్పత్రి వర్గాలు చనిపోయిన బిడ్డను పాతి పెట్టేయాలని కొందరికి పని అప్పగించాయి. వారు గొయ్యి తవ్వుతుండగా బిడ్డ కదలడం చూసి ఆశ్చర్యపోయారు. ఏం చేయాలో తెలీని స్థితిలో అలాగే ఉండిపోయారు. ఆ కాసేపు పెనుగులాట తరువాత బిడ్డ కూడా కదలడం మానేసింది.

దీంతో వారు కూడా ఏమీ చేసేది లేక చనిపోయిందని నిర్థారించుకుని పూడ్చిపెట్టారు. ఈ విషయం బయటకు తెలియడంతో స్థానికులంతా ఆస్పత్రి తీరుమీద మండిపడుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu