మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు..

Published : Jul 10, 2021, 10:07 AM IST
మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు..

సారాంశం

దీని ప్రభావంతో శనివారం మోస్తారు వర్షాలు, ఆదివారం, సోమవారం అక్కడక్కడ   భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. తీరం వెంబడి గంటకు 50-60 కీ.మీ వెగంతో గాలులు వీస్తాయని,  సముద్రం అలజడిగా ఉంటుందని హెచ్చరించారు. 

అమరావతి : ఐఎండి సూచనల ప్రకారం పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతం
ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరప్రాంతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 

దీని ప్రభావంతో శనివారం మోస్తారు వర్షాలు, ఆదివారం, సోమవారం అక్కడక్కడ   భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. తీరం వెంబడి గంటకు 50-60 కీ.మీ వెగంతో గాలులు వీస్తాయని,  సముద్రం అలజడిగా ఉంటుందని హెచ్చరించారు. 

మత్స్యకారులు మంగళవారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదంటూ విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు హెచ్చరిక జారీ చేశారు. రాగల మూడు రోజుల వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి... 

జూలై 10 శనివారం : ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.

జూలై 11 ఆదివారం : కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, 
రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.

జూలై 12 సోమవారం : రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు మిగిలిన చోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu