కత్తితో పొడిచి, టవల్ తో గొంతు నులిమి హత్య : ప్రేమోన్మాది కట్టుకథ అల్లీ....

Published : Jul 02, 2021, 11:54 AM IST
కత్తితో పొడిచి, టవల్ తో గొంతు నులిమి హత్య : ప్రేమోన్మాది కట్టుకథ అల్లీ....

సారాంశం

ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గురువారం దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది తన ప్రేమికురాలి ఇంట్లోకి చొరబడి ఆమెను అతి కిరాతకంగా హతమర్చాడు. చుట్టుపక్కల వాళ్లు రావడంతో తానూ ఆత్మహత్యయత్నం చేశాడు. 

ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గురువారం దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది తన ప్రేమికురాలి ఇంట్లోకి చొరబడి ఆమెను అతి కిరాతకంగా హతమర్చాడు. చుట్టుపక్కల వాళ్లు రావడంతో తానూ ఆత్మహత్యయత్నం చేశాడు. 

సమాచారం అందుకున్న వెంటనే వచ్చిన పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే యువతి మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.

గూడూరులోని తిరుపతి రైల్వే లైన్ గేట్ సమీపంలో పల్లెపాటి సుధాకర్, సరిత దంపతులు నివసిస్తున్నారు. వీరిద్దరూ ఉపాధ్యాయులు. వీరిక ఇంజనీరింగ్ చదువుతున్న తేజస్విని, పదో తరగతి చదువుతున్న కుమారుడు సంతానం. గురువారం దంపతులిద్దరూ పాఠశాలకు వెళ్లగా ఇంట్లో తేజస్విని, ఆమె సోదరుడు ఉన్నారు.

చెన్నూరు పాఠశాలలో రికార్డు అసిస్టెంట్ గా పనిచేస్తున్న చిన్నికృష్ణ కుమారుడు వెంకటేష్ బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ప్రస్తుతం ఇది దగ్గరే ఉండి పని చేస్తున్నాడు. తేజస్విని, వెంకటేష్ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఈ విషయం పెద్దలకు తెలియడంతో వారిద్దరూ కలవకుండా కట్టడి చేశారు. 

గురువారం యువతి తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లగానే వెంకటేష్ ఆమె ఇంటికి వచ్చాడు. తేజస్విని సోదరుడు తలుపు తీయగానే అతడిని నెట్టేసి లోపలికి చొరబడి ఆమె ఉన్న గదిలోకి వెళ్లి గడియపెట్టేశాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏం జరిగిందో గానీ వెంకటేష్.. తేజస్విని గొంతులో కత్తితో పొడిచి, ఆపై టవల్ తో గొంతు నులిమి చంపేశాడు. యువతి సోదరుడి కేకలతో అక్కడికి చేరుకున్న ఇరుగుపొరుగువారు కిటికీ లోంచి చూడగా బెడ్ మీద తేజస్విని పడిఉంది. స్థానికులు రావడంతో భయపడ్డ వెంకటేష్ ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. 

ఈ లోపు అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. ఇద్దరినీ హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే యువతి మృతి చెందిందని.. వెంకటేష్ కు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan with “Tiger of Martial Arts” Title: టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు| Asianet Telugu
Raghurama krishnam raju: ఘట్టమనేని ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే RRR స్పీచ్| Asianet News Telugu