కారు మీద ఉమ్మేశాడని వ్యక్తిని బెల్టుతో చితకబాదిన యువకుడు.. విజయవాడలో అర్థరాత్రి హల్ చల్.. ట్విస్ట్ ఏంటంటే..

By SumaBala Bukka  |  First Published Apr 13, 2023, 8:58 AM IST

తన కారు మీద ఉమ్మేశాడని రోడ్డు మీద వెడుతున్న వ్యక్తిని బెల్టుతో చితకబాదాడో యువకుడు. అయితే, అతని కారు మీద ఎంపీ స్టిక్కర్ ఉండడం, ఆ తరువాత మాయం కావడం చర్చనీయాంశంగా మారింది. 


విజయవాడ :  ఏపీలోని విజయవాడలో అర్ధరాత్రి జాతీయ రహదారి మీద ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. తన కారు మీద ఓ వ్యక్తి ఉమ్మేశాడు అంటూ హల్చల్ చేశాడు. దీంతో సదరు యువకుడిని పోలీసులు పట్టుకుని స్టేషన్ కు తీసుకెళ్లారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ యువకుడు నడుపుతున్న కారు మీద ఎంపీ స్టిక్కర్ ఉంది. పోలీసులు పట్టుకున్న సమయంలోనూ అది కనిపించింది.. కానీ స్టేషన్కు తరలించేసరికి ఆ స్టిక్కర్ మాయమైంది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే…

మంగళవారం రాత్రి 11.45 నిమిషాలకు గోవిందరాజు అనే విజయవాడ పటమటకు చెందిన వ్యక్తి టూ వీలర్ మీద రామప్పవరపాడు వైపు పెడుతున్నాడు. లబ్బీపేటకు చెందిన కొండపల్లి నిఖిల్ ఆ సమయంలోనే గోవిందరాజు బైకు వెనకే కారులో వస్తున్నాడు. రమేష్ ఆసుపత్రి కూడలిలోకి వచ్చేసరికి.. గోవిందరాజు  రోడ్డు మీద ఉమ్మేశాడు. బండి వెనకే వస్తున్న కారు మీద ఆ ఉమ్మి పడింది. దీంతో నిఖిల్ ఆగ్రహానికి వచ్చాడు. బైక్ ముందుకు కారు తీసుకెళ్లి.. బైకు వెళ్లకుండా అడ్డంగా ఆపి కారు దిగాడు. కారు దిగుతూనే.. నిఖిల్ తన నడుముకున్న బెల్టును తీశాడు. ఏమాత్రం  సంభాషణ లేకుండా గోవిందరాజును చితకబాదాడు. 

Latest Videos

undefined

తెలంగాణలో వుండి కాదు.. ఏపీకి వచ్చి మాట్లాడు : హరీశ్ రావుకు మంత్రి అప్పలరాజు సవాల్

గోవిందరాజు బైకు తాళం, ఫోను అతని దగ్గర నుంచి లాక్కున్నాడు.  ఆ సమయంలో అటు నుంచి వెళుతున్న వాహనదారులు ఈ గలాటా చూసి.. నిఖిల్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ నిఖిల్ వారి మీద కూడా దాడికి ప్రయత్నించాడు. వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. అక్కడ చేరుకున్న పోలీసులు  గోవిందరాజు, నిఖిల్ ఇద్దరిని మాచవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. గొడవ విషయం తెలడంతో..  విచారణ జరిపిన పోలీసులు నిఖిల్ మీద 341, 323, 324 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే నిఖిల్ ని అరెస్టు చేసిన సమయంలో కారు మీద ఎంపీ స్టిక్కర్ ఒకటి ఉంది.  

పోలీస్ స్టేషన్కు తరలించిన తర్వాత బుధవారం ఉదయానికి ఆ స్టిక్కర్ కనిపించకుండా పోయింది.  పోలీసుల అధీనంలో ఉండగా స్టిక్కర్ ఎలా మాయమైంది?  ఎవరు తీశారు అనేది అంతు పట్టకుండా ఉంది.  నిఖిల్ వైసీపీ నేత అనుచరుడు. అతని వాహనం కావడం వల్లే స్టిక్కర్లను రహస్యంగా తొలగించి ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసిపికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి బంధువుల దగ్గర నుంచి నిఖిల్ ఆర్ స్టిక్కర్లను తీసుకుని.. వాడుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 

click me!