మచిలీపట్నం పర్యటన: జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీల హంగామా.. సీఎం అంటూ నినాదాలు, చంద్రబాబు పక్కనే

Siva Kodati |  
Published : Apr 12, 2023, 08:34 PM IST
మచిలీపట్నం పర్యటన: జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీల హంగామా.. సీఎం అంటూ నినాదాలు, చంద్రబాబు పక్కనే

సారాంశం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మచిలీపట్నం పర్యటనలో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, బ్యానర్లు హల్‌చల్ చేశాయి. దీంతో పాటు ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు సైతం వినిపించాయి. 

చంద్రబాబు నాయుడు తర్వాత తెలుగుదేశం పార్టీనీ కాపాడే నాథుడు ఎవరు? ప్రస్తుతం ఈ చర్చ ఆ పార్టీలోనే కాదు, ఏపీలోని అన్ని పార్టీల్లోనూ జోరుగా జరుగుతోంది. సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో వరుస ఓటములకు తోడు.. కీలక నేతలు, పార్టీకి ఎప్పటి నుంచో కొమ్ముకాస్తూ వస్తున్న కేడర్ చేజారిపోతుండడం పార్టీ అధిష్టానంలో ఆందోళన పెంచుతోంది. ఇప్పటికే కీలక నేతలంతా వైసీపీ , బీజేపీల్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం చంద్రబాబు వెంట ఉన్న నేతలు ఎవరు అన్నది కూడా అంతు చిక్కడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వేళ్ల పై లెక్కించేంత మంది చంద్రబాబుతో రెగ్యులర్‌గా మీటింగ్‌ల‌లో పాల్గొంటూ ఉంటున్నారని పార్టీ నేతలు చెబుతున్న మాట. 

ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ నామస్మరణ రోజు రోజుకూ పెరుగుతోంది. పార్టీకి మళ్లీ పూర్వవైభవం రావాలంటే ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలనే డిమాండ్ పెరుగుతోంది. ఎన్టీఆర్ ఎక్కడ కనిపించినా.. అభిమానులు, టీడీపీ కార్యకర్తలు కాబోయే సీఎం అంటూ నినాదాలు కూడా చేస్తున్నారు. దీనిపై ఎన్టీఆర్ సీరియస్ అవుతున్నా.. అభిమానుల నుంచి డిమాండ్ ఆగడం లేదు.. ఇంకాస్త పెరుగుతూ వస్తోంది.

Also Read: కుప్పం పర్యటన: జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీల హంగామా, చంద్రబాబు పక్కనే

మొన్నామధ్య కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబుకే స్వయంగా నిరసన సెగ ఎదురైంది. పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్‌ను ఎప్పుడు తీసుకొస్తున్నారంటూ కార్యకర్తలు నిలదీశారు. కానీ టీడీపీ చీఫ్.. మాటను దాట వేశారు. మాస్ ఇమేజ్, తాత ఎన్టీఆర్ పోలికలు, ఎంతటివారినైనా మాటలతో ఆకట్టుకునే తత్వం ఉండటంతో జూనియర్‌ను తెలుగుదేశం పార్టీలో క్రీయాశీలకంగా చూడాలని అభిమానులు భావిస్తున్నారు. గతంలోనూ ఎన్టీఆర్ టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. తాను తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల పని చేస్తానని, ఎప్పుడు తన అవసరం వస్తే అప్పుడు సేవలందిస్తానని గతంలోనే జూనియర్ ప్రకటించారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో వుండటంతో రావాల్సిన సమయం వచ్చిందని అంటున్నారు.

తాజాగా చంద్రబాబు కృష్ణా జిల్లా పర్యటనలోనూ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు, ఫ్లెక్సీలతో హంగామా సృష్టించారు ఆయన ఫ్యాన్స్. బెజవాడ నుంచి బందర్ వరకు చంద్రబాబు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న, హరికృష్ణల ఫోటోలను ప్రదర్శిస్తూ నందమూరి అభిమానులు హల్‌చల్ చేశారు. అంతేకాదు.. కేవలం ఫోటోల ప్రదర్శనకే పరిమితం కాకుండా సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chandrababu Speech: చంద్రబాబు సినిమా డైలాగ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu
మండుటెండల్లో చంద్రబాబు.. వేమిరెడ్డి సూపర్ స్పీచ్ | Vemireddy Prabhakar Reddy Speech | Asianet Telugu