గుంటూరులో దారుణం... అనుమానంతో భార్యను చంపి భర్త ఆత్మహత్య

Arun Kumar P   | Asianet News
Published : Dec 21, 2021, 02:17 PM ISTUpdated : Dec 21, 2021, 02:29 PM IST
గుంటూరులో దారుణం... అనుమానంతో భార్యను చంపి భర్త ఆత్మహత్య

సారాంశం

అనుమానం పెనుభూతంగా మారి కట్టుకున్న భార్యను అతికిరాతంగా హతమార్చిన భర్త ఆ తర్వాత తానుకూడా సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాద ఘటన గుంటూరులో చోటుచేసుకుంది.

గుంటూరు: భార్యపై అనుమానంతో ఓ కసాయి భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను అతి కిరాతకంగా హతమార్చి ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.  

గుంటూరు జిల్లా (guntur district) పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రు గ్రామానికి చెందిన మనీషా(27)‌-ఏసుబాబు(30) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు మగపిల్లలు. ఇంతకాలం పిల్లా పాపలతో ఆనందంగా సాగిన వీరి జీవితంలో ఇటీవలే అలజడి మొదలయ్యింది. భార్యపై ఏసుబాబు అనుమానం పెంచుకోవడం గొడవలకు దారితీసింది. ఈ మధ్య తరచూ భార్యాభర్తల మద్య గొడవలు జరుగుతుండేవి.  

ఈ క్రమంలో ఇవాళ కూడా భార్యాభర్తల మద్య గొడవ జరిగింది. ఇద్దరిమధ్యా మాటామాటా పెరగడంతో కోపంలో విచక్షణ కోల్పోయిన ఏసుబాబు భార్య మనీష పై రోకలిబండతో దాడిచేసాడు. దీంతో ఆమె తల పగిలి తీవ్ర రక్తస్రావమయ్యింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన మనీషను కుటుంబసభ్యులు దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందింది. 

read more  దారుణం : కూతురు హత్య కేసులో జైలుకు.. పెరోల్ పై బైటికి వచ్చాక, శిక్ష తప్పించుకోవడానికి కూలీని చంపి..

భార్య చనిపోయినట్లు తెలియడంతో ఏసుబాబు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా ఒకేసారి తల్లిదండ్రుల మృతితో ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారు. 

దంపతుల మృతితో పచ్చలతాడిమర్రులో విషాదం నెలకొంది. ఏసుబాబు ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మనీష హత్యా, ఏసుబాబు ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పొన్నూరు రూరల్ పోలీసులు తెలిపారు.

read more  విజయనగరం: ఇంట్లో రక్తపు మరకలు, డబ్బు మాయం.. మిస్టరీగా మారిన వైద్యుడి అదృశ్యం

ఇదిలావుంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో దారుణం వెలుగుచూసింది. కేవలం సెల్ ఫోన్ కోసం స్నేహితుల మధ్య జరిగిన గొడవలో ఒకరు బలయ్యారు. సెల్‌ఫోన్ ఇవ్వలేదని ఓ కసాయి స్నేహితుడినే కొట్టి చంపేసాడు. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన 26 సంత్స‌రాల జితేంద‌ర్ ఉపాధి కోసం ఇటీవ‌లే హైద‌రాబాద్ వ‌చ్చాడు. అత‌ను  ఆసిఫ్ నగర్ ఏరియా జిర్రాలోని వర్క్‌షాపులో కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతని స్నేహితుడు ఫరూఖ్ కూడా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి ఉపాధి కోసం హైద‌రాబాద్ కు వ‌చ్చాడు. త‌న స్నేహితుడైన జితేంద‌ర్ వ‌ద్ద‌ే ఉంటూ అతనితో కలిసి వర్క్‌షాపులో పనిచేస్తున్నాడు. 

అయితే ఆదివారం ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దు కానీ.. అనూహ్యంగా జితేందర్ వర్క్‌షాప్‌లో శవమై క‌నిపించాడు.  ఉత్త‌ర‌ప్రదేశ్ నుంచి ఇటీవ‌లే వ‌చ్చిన ఫ‌రూక్ సైతం  తీవ్రగాయలతో అక్కడే పడి ఉన్నాడు.  ఉద‌యం వ‌ర్క్ షాప్ వ‌ద్ద‌కు రాగానే య‌జ‌మానికి ఈ భ‌యాన‌క దృశ్యాలు క‌నిపించాయి. వెంట‌నే వ‌ర్క్ షాప్ య‌జ‌మాని ముంతాజిర్  పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. 

అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీసారు. ద‌ర్యాప్తులో ఈ ఇద్ద‌రు స్నేహితుల మ‌ద్య సెల్ ఫోన్ కార‌ణంగా చోటుచేసుకున్న గొడ‌వ‌తోనే ఈ దారుణ ఘ‌ట‌న జ‌రిగింద‌ని పోలీసులు గుర్తించారు. ఫరూఖ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు జితేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్