మేడికొండూరు గ్యాంగ్‌రేప్ కేసు: కీచక ముఠా అరెస్ట్, ఒంటరి మహిళలే టార్గెట్.. అత్యాచారం చేసి కొండల్లోకి

By Siva Kodati  |  First Published Dec 21, 2021, 2:41 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా (guntur) మేడికొండూరు గ్యాంగ్‌రేప్ కేసును (medikonduru gang rape case) పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. మహిళలపై వరుస అత్యాచారాలకు పాల్పడుతోన్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు.


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా (guntur) మేడికొండూరు గ్యాంగ్‌రేప్ కేసును (medikonduru gang rape case) పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. మహిళలపై వరుస అత్యాచారాలకు పాల్పడుతోన్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. గుంటూరులో ఓ దోపిడీ కేసు విచారిస్తుండగా కిరాతక ముఠా దారుణాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులంతా కర్నూలుకు చెందిన పాత నేరస్తులుగా గుర్తించారు. 

రాత్రివేళ ఒంటరిగా వెళ్తున్న మహిళలపై దాడి చేసి అత్యాచారం చేయడం ఈ ముఠా పనిగా పెట్టుకుంది. అత్యాచారానికి పాల్పడ్డ అనంతరం కొండ ప్రాంతానికి వెళ్లి తలదాచుకుంటున్నట్లుగా పోలీసులు తేల్చారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా మేడికొండూరులో భర్తను కట్టేసి అతని కళ్లెదుటే భార్యపై అత్యాచారానికి పాల్పడింది కీచక ముఠా. ఇప్పటి వరకు గుంటూరు, విజయవాడ, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఈ గ్యాంగ్ అత్యాచారాలకు పాల్పడినట్లుగా గుర్తించారు. గతంలో కూడా అత్యాచారాలకు పాల్పడినట్లుగా పోలీసులు తేల్చారు. 

Latest Videos

undefined

Also read:మేడికొండూరు గ్యాంగ్‌రేప్ కేసు: పోలీసుల తీరుపై విమర్శలు.. స్పందించిన గుంటూరు డీఐజీ

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో సెప్టెంబర్ 8న బైక్ మీద వెళ్తున్న దంపతులను దుండగులు అడ్డగించారు. మహిళ భర్తను తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత కత్తులతో బెదిరించి వివాహితను పొలాల్లోకి తీసుకుని వెళ్లి అక్కడ సామూహిక అత్యాచారం చేసి పారిపోయారు. దానిపై బాధితురాలు అర్థరాత్రి సత్తెనపల్లి పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే అప్పట్లో ఈ ఘటనలో పోలీసులు తీరుపై విమర్శలు వచ్చాయి. 

ఘటన జరిగిన ప్రదేశం గుంటూరు అర్బన్ ఎస్పీ పరిధిలోకి వస్తుందని, తమ పోలీసు స్టేషన్ ఆ పరిధిలోకి రాదని సత్తెనపల్లె పోలీసులకు చెప్పారు. దాంతో బాధితులు వెనక్కి మళ్లారు. ఘటన ఎక్కడ జరిగినా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని కేసును సంబంధిత పోలీసు స్టేషన్ కు బదిలీ చేయాలని ఉన్నతాధికారులు గతంలోనే ఆదేశించినప్పటికీ సత్తెనపల్లి పోలీసులు ఫిర్యాదును తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. 

click me!