వైసిపికి మరో షాక్ ... టిడిపి గూటికి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే

Published : Mar 02, 2024, 11:45 AM ISTUpdated : Mar 02, 2024, 12:00 PM IST
వైసిపికి మరో షాక్ ... టిడిపి గూటికి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే

సారాంశం

ఎలక్షన్స్ సీజన్ లో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు వేగంగా మారుతున్నారు. తాజాగా మరో సిట్టింగ్ ఎమ్మెల్యే అధికార వైసిపిని కాదని ప్రతిపక్ష టిడిపిలో చేరారు. ఇంతకు ఆయన ఎవరంటే....

హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు నేడు తెరపడింది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇప్పటికే అధికార వైసిపికి రాజీనామా చేయగా తాజాగా తెలుగుదేశం పార్గీలో చేరారు. స్వయంగా చంద్రబాబు నాయుడే పసుపు కండువా కప్పి వసంతను టిడిపిలో ఆహ్వానించారు. వసంత అనుచరులు, మైలవరంకు చెందిన మరికొందరు వైసిపి నేతలు వసంత వెంట నడిచారు. ఓ ఎంపిపి, ఇద్దరు వైస్ ఎంపిపిలు,  12 మంది సర్పంచ్ లు, 6 గురు ఎంపిటిసిలు, సొసైటీ అధ్యక్షులు 7, వైసిపి మండలాధ్యక్షులు 2, కౌన్సిలర్లు 4 ఎమ్మెల్యే వసంతతో కలిసి టిడిపిలో చేరారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది. 

వీడియో

వసంత చేరికతో మైలవరం రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. గతంలో ఇదే వసంత వైసిపి నుండి పోటీచేయగా మాజీ మంత్రి దేవినేని ఉమ టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగారు. కానీ ఇప్పుడు ఇద్దరు ప్రత్యర్థులు ఒకే పార్టీలో వుండటంతో వారి అనుచరుల్లోనే కాదు టిడిపి శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఇది చాలదన్నట్లు ఇరువురు నేతలు కూడా మైలవరం టికెట్ తమదేనంటూ స్వయంగా ప్రకటించుకోవడం కన్ఫ్యూజన్ మరింత ఎక్కువ అవుతోంది. కాబట్టి టిడిపి అధిష్టానం అధికారిక ప్రకటనతోనే మైలవరం సీటుపై క్లారిటీ రానుంది.  

జగన్మోహినీ...నువ్వొచ్చినా పర్వాలేదమ్మా..!: సీఎంకు రఘురామ ఛాలెంజ్

ఇదిలావుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే వసంతను కాదని ఓ జడ్పిటిసిని  వైసిపి ఇంచార్జీగా నియమించారు. మైలవరం జడ్పిటిసి తిరుపతిరావుకు ప్రమోషన్ కల్పిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్. దీంతో అంతకు ముందునుండే వైసిపిపై అసహనంతో వున్న వసంత కృష్ణప్రసాద్ పార్టీని వీడాలని డిసైడ్ అయిపోయారు. వెంటనే రాజీనామా చేసి తాజాగా టిడిపిలో చేరారు.

అయితే వసంత టిడిపి చేరిక అంత సాఫీగా ఏమీ జరగలేదు. ఆయన రాకను టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ టిడిపి అధిష్టానం మాత్రం మైలవరంలో తిరిగి ఆయనకే గెలుపు అవకాశాలు ఎక్కువగా వున్నాయని నమ్మింది. అందువల్లే ఉమాను స్వయంగా చంద్రబాబు నాయుడే ఒప్పించి వసంత రాకకు లైన్ క్లియర్ చేయారు.  

Andhra Pradesh Assembly Elections 2024 : లోకేష్ పై ఓ మహిళ పోటీ ... ఎవరీ లావణ్య?

ఇక వసంత కృష్ణప్రసాద్ కూడా దేవినేని ఉమతో కలిసి పనిచేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపాడు. ఆయనతో తనకు కేవలం రాజకీయ విబేధాలు మాత్రమే వున్నాయని... వ్యక్తిగతంగా శత్రుత్వమేమీ లేదన్నారు. ఏది ఎలావున్నా అంతిమంగా టిడిపి గెలుపుకోసమే ఇద్దరం పనిచేస్తామని... రాబోయే ఎన్నికల్లో వైసిపిని ఓడిస్తామన్నారు. మైలవరం టికెట్ ఎవరికి ఇచ్చినా సరే... పార్టీ నిర్ణయానికి కట్టుబడి వుంటానని వసంత కృష్ణప్రసాద్ వెల్లడించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?