జగన్మోహినీ...నువ్వొచ్చినా పర్వాలేదమ్మా..!: సీఎంకు రఘురామ ఛాలెంజ్

Published : Mar 02, 2024, 10:34 AM ISTUpdated : Mar 02, 2024, 10:49 AM IST
జగన్మోహినీ...నువ్వొచ్చినా పర్వాలేదమ్మా..!: సీఎంకు రఘురామ ఛాలెంజ్

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జగన్మోహినీ అని సంబోధిస్తూ ఓ ఛాలెంజ్ విసిరారు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు.  ఆ ఛాలెంజ్ ఏమిటంటే...

నరసాపురం : వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సెటైర్లు వేసారు. ఇప్పటికే తిరిగి నరసాపురం లోక్ సభ నుండే ఎంపీగా పోటీ చేస్తాను... టిడిపి-జనసేన కూటమి అభ్యర్థిని తానే అని రఘురామ ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో తనపై కుటుంబసభ్యులనే పోటీకి దింపేందుకు వైసిపి విశ్వప్రయత్నం చేస్తోందని... చివరకు పోటీ చేయకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని రఘురామ తెలిపారు. కానీ చావనైనా చస్తాం కానీ రఘురామపై పోటీ చేయమని తన కుటుంబసభ్యులు చెప్పినట్లు రఘురామ బయటపెట్టారు. 

ఇక సీఎం జగన్ ను జగన్మోహినీ అని సంబోధిస్తూ ఓ ఛాలెంజ్ విసిరారు రఘురామ. తనమీద ఎవరిని పోటీకిపెట్టినా సరే... లేదా నువ్వొచ్చినా పర్వాలేదమ్మా జగన్మోహనా..! కానీ  దరిద్రంగా వాళ్లతో వీళ్లతో బేరాలేంట్రా? అంటూ చురకలు అంటించారు. ఇప్పటికే నరసాపురం లోక్ సభ ఇంచార్జీగా ప్రకటించిన బిసి నాయకురాలు గూడూరు ఉమాబాలను తప్పించి మరో క్షత్రియ పుత్రుడిని బరిలోకి దింపేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు.  జగన్మోహనా... బిసిలంటే అంత చులకనా? అంటూ ప్రశ్నించారు రఘురామ కృష్ణంరాజు. 

ఇక వైఎస్ సునీత తన తండ్రి హత్యపై తాజాగా  చేసిన కామెంట్స్ పై రఘురామ స్పందించారు. వైఎస్ వివేకాను ఎవరు చంపారు? సుపారీ ఇచ్చింది చంపిదెవరు? ఎలా చంపారు? అన్నది అందరికీ తెలుసు.. ఇది బహిరంగ రహస్యమేనని అన్నారు. తాజాగా సునీత కూడా తన తండ్రి హత్యతో సంబంధమున్న పార్టీని ఓడించాలని... జగనన్నకు ఓటేయవద్దని చెప్పడంద్వారా హంతకులెవరో చెప్పకనే చెప్పారన్నారు రఘురామ కృష్ణంరాజు.

వైసిపికి ఓటెయ్యకండి.. జగనన్నకు గెలిపించకండి..: వైఎస్ సునీత

వైఎస్ వివేకాను చంపిందెవరో సిబిఐకి తప్ప ప్రజలందరికీ తెలుసని అన్నారు. సమయం వచ్చినపుడు సిబిఐకి కూడా అన్నీ తెలుస్తాయని... అప్పుడు హంతుకులెవరో బయటపడుతుందన్నారు. అప్పటివరకూ అందరూ నటిస్తూనే వుంటారని పరోక్షంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసారు ఎంపీ రఘురామ. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే