పెళ్లికి పెద్దలు నో: విషం తాగిన ప్రేమ జంట.. ప్రియురాలు మృతి, విషమంగా యువకుడి ఆరోగ్యం

Siva Kodati |  
Published : Jun 07, 2022, 02:20 PM ISTUpdated : Jun 07, 2022, 02:22 PM IST
పెళ్లికి పెద్దలు నో: విషం తాగిన ప్రేమ జంట.. ప్రియురాలు మృతి, విషమంగా యువకుడి ఆరోగ్యం

సారాంశం

తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో విశాఖలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియురాలు మరణించగా.. ప్రియుడి పరిస్ధితి విషమంగా వుంది.   

విశాఖలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో వారిద్దరూ విషం తాగి బలవన్మరణానికి యత్నించారు. ఈ ఘటనలో ప్రియురాలు మరణించగా.. ప్రియుడి పరిస్ధితి విషమంగా మారింది. దీంతో అతనిని మెరుగైన చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. స్థానిక ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

AP Food Commission Warning at NTR District | “మీ ఉద్యోగం పోతుంది చూసుకోండి” | Asianet News Telugu
IMD Rain Alert : శ్రీలంక సమీపంలో ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు