నర్సీపట్నం ఎమ్మెల్యేకు నిరసన సెగ: అయ్యన్నపై ఎమ్మెల్యే గణేష్ ఫైర్

Published : Jun 07, 2022, 02:14 PM IST
  నర్సీపట్నం ఎమ్మెల్యేకు నిరసన సెగ: అయ్యన్నపై ఎమ్మెల్యే గణేష్ ఫైర్

సారాంశం

గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లిన నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కు నిరసన సెగ తగిలింది. అమ్మఒడి కార్యక్రమం గురించి స్థానికులు ప్రశ్నించారు. దీని వెనుక టీడీపీ నేతలున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

నర్సీపట్నం: ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలోని Narsipatnam అసెంబ్లీ నియోజకవర్గంలో మంగళవారం నాడు గడప గడపకు వైసీపీ  కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గణేష్ కు నిరసన సెగ తగిలింది. మాజీ మంత్రి Ayyanna patrudu ఈ నిరసన వెనుక ఉన్నారని ఎమ్మెల్యే గణేష్ అనుమానించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై మండిపడ్డారు.

గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలో నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలోని పెదగొలుగొండపేటలో ఎమ్మెల్యే Uma Shankar Ganesh నేతృత్వంలో YCP  కార్యకర్తలు, నేతలు వెళ్లారు. అయితే ఈ గ్రామానికి చెందిన స్థానిక మహిళలు ఎమ్మెల్యేకు నిరసన తెలిపారు. ఈ నిరసన వెనుక TDP నేతలున్నారని ఎమ్మెల్యే గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని చూసుకుందాం రా అని సవాల్ విసిరారు.  అయ్యన్నపాత్రుడి ఇంటికి కూడా వెళ్లలేరని ఆయన వార్నింగ్ ఇచ్చారు. మైక్ లోనే ఎమ్మెల్యే బూతులు మాట్లాడారని స్థానికులు చెప్పారు.. అమ్మఒడి రాలేదని అడిగేందుకు వచ్చిన మహిళలపై ఎమ్మెల్యే దురుసుగా వ్యవహరించాడని స్థానికులు ఆరోపించారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదన్నారు

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Motivational Speech: Superman కాదు.. Hanuman గురించి చెప్పండి | Asianet News Telugu
Chandrababu, Mohan Bhagwat Attends Bharatiya Vigyan Sammelan Inaugural Session | Asianet News Telugu