
వందల కోట్లరూపాయల విలువైన సదావర్తి సత్రం భూములు తమకు దక్కలేదన్న అక్కసు నారా లోకేష్ లో బయటపడింది. కోర్టు తీర్ప ప్రకారం సదావర్తి భూములు కొనేందుకు ముందుకు వచ్చేవారిపై ఐటిదాడులు చేయిస్తామంటూ చెప్పి సంచలన ప్రకటన చేసారు. ఇది ఒకరకంగా కోర్టు తీర్పను ధిక్కరించటమే అన్న విషయం లోకేష్ మరచిపోయినట్లున్నారు. ప్రభుత్వం 84 ఎకరాలను కేవలం రూ. 22 కోట్లకు రామానుజయ్యకు కట్టబెట్టేసింది. దాన్ని వైసీపీ ఎంఎల్ఏ సవాలు చేయటంతో కథ అడ్డం తిరిగింది. రూ. 5 కోట్లు అదనంగా చెల్లించిన వారికి భూములను ఇచ్చేయాలంటూ కోర్టు చెప్పిన తీర్పుతో చంద్రబాబు ప్రభుత్వానకి దిమ్మతిరిగింది.
దాంతో తాము తీసుకోవాలనుకున్న భూములను తమకు కాకుండా చేసిన వైసీపీ ఆళ్ళ రామకృష్ణా రెడ్డి పై లోకేష్ తన అక్కసంతా వెళ్ళగక్కుతున్నారు. కోర్టు తీర్పు ప్రకారం రూ. 27 కోట్లతో భూములు కొనుగోలు చేయలనుకున్న వారిపై ఐటి దాడులు చేస్తుందని బెదిరించటం మొదలుపెట్టారు. ఐటిదాడులకు భయపడి భూములు కొనటానికి ఎవరూ ముందుకు రాకపోతే వైసీపీ ఓడిపోయినట్లే అన్న విచిత్రమైన లాజిక్ లేవదీసారు. అంటే గడచిన మూడేళ్ళుగా పలువురు నేతలు ఆక్రమించుకున్న, కబ్జా చేసిన, తాజాగా విశాఖపట్నంలో సొంతం చేసుకున్న భూములన్నీ టిడిపి వారే చేసినట్లు లోకేష్ మాటలను బట్టి అనుకోవాల్సి వస్తుంది.