
ప్రపంచమంతా బీర్ ను మద్యం క్రింద పరిగణిస్తోంది. కానీ చంద్రబుబనాయుడు ప్రభుత్వం మాత్రం బీర్ ను హెల్త్ డ్రింకే అంటోంది. ఎక్సైజ్ శాఖమంత్రి జవహర్ మాట్లాడుతూ, బీర్ ముమ్మాటికీ హెల్త్ డ్రింకే అంటున్నారు. హెల్త్ డ్రింక్ క్యాటగిరీలోనే బీర్ ను తమ ప్రభుత్వం ప్రమోట్ చేస్తుందని కూడా చెబుతున్నారు. బీర్ హెల్త్ డ్రింక్ ఎలా అవుతుందని ప్రశ్నిస్తే, ముమ్మాటికీ అది హెల్త్ డ్రింకే అంటూ వాదిస్తున్నారు. పైగా బీర్ హెల్త్ డ్రింకన్న విషయాన్ని శాస్త్రీయంగా నిరూపిస్తమాంటూ సవాలు కూడా విసురుతున్నారు. ఇంకేముంది ఎంచక్కా ప్రతీ ఒక్కళ్ళూ బీర్ ను ఇంట్లోనే పెట్టుకుని, పైగా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ తాగచ్చన్నమాట.