పెద్దమనిషవుతున్న ఆనందంలో చిన్నబాబు

First Published Feb 27, 2017, 12:23 PM IST
Highlights

 ‘చిన్న వయసులోనే పెద్దల సభకు పంపుతున్నదుందకు కృతజ్ఞతలు‘

 చట్టాలు చేసేటపుడు పెద్దల మార్గదర్శకత్వం ఉండాలని  పార్లమెంటులో పెద్దల సభ ప్రవేశపెట్టారు. ఆ సభని  (పార్లమెంటులో రాజ్యసభఅని, రాష్ట్రంలో లెజిస్టేటివ్ కౌన్సిల్) పెద్దల సభ (ఎల్డర్స్ హౌస్ ) లేదా ఎగువ సభ (అప్పర్ హౌస్ )  అని  అంటారు.

 

ఇపుడు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఈ సభలో ప్రవేశించేందుకు రంగం సిద్ధమయింది. ఈ సభలో ప్రవేశించగానే ఆయన పెద్ద మనిషవుతారు. తెలుగుదేశం పార్టీని ఇంతవరకు నడిపించిన అనుభవం తో ఆయన సభలో చట్టాలు చేసేటపుడు సలహా లిస్తారు. మార్గదర్శకత్వం చూపిస్తారు.

 

ఎమ్మెల్సీగా ప్రజలకు న్యాయం చేయాలన్నదే ఆశయమని  తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు ప్రకటించారు.


ఎమ్మెల్సీగా తన పేరు  ప్రతిపాదించి,ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించినందుకు ఆయన   తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరోకు ధన్యవాదాలు తెలిపారు. 

 

ఈ మేరకు ఆయన ట్విట్టర్లో స్పందించారు.

 

ఉప ఎన్నికలలో గెలుస్తానన్న ధైర్యం లేకనే, ఆయన సురక్షితమయిన కౌన్సిల్ రూట్ ఎన్నుకున్నారని సోషల్ మీడియాలో చిన్న బాబు మీద తెగ సెటైర్లు వస్తున్నాయి. వీటిని ఖాతరు చేయకుండ ఆయన తండ్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమయిన  పాలిట్ బ్యూరో తనని పెద్దల సభకు పంపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

 

తన సామర్థ్యమేమిటో గుర్తించి తనపేరును ఎమ్మెల్సీ గా ప్రతిపాదించడం పట్ల హృదయ పూర్వక ధన్యవాదాలు అని  తన ట్వీట్ లో పేర్కొన్నారు. దగ్గరుండి ప్రజలకు సేవ చేసేందుకు ఇదొక మంచి అవకాశం అని కూడా చిన్నబాబు గర్వపడ్డారు. 

 

ప్రజలకు సేవ చేయడమే కాదు,సామర్థ్యం నిరూపించుకునేందుకు కూడా ఇదొక అవకాశం.

 

click me!