
ఢిల్లీలో ఏపి ఐటీ మంత్రి లోకేష్ బిజీబిజీగా ఉన్నారు. ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్య నాయుడితో లోకేష్ భేటీ అయ్యారు. ఎపిజె అబ్దుల్ కలాం రోడ్డులోని వెంకయ్యనాయుడు నివాసంలో ఆయనని మర్యాదపూర్వకంగా కలిసిన లోకేష్. వెంకయ్య నాయుడుకి శాలువాతో సత్కరించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వెంకయ్యనాయుడు సాధారణ కార్యకర్త నుండి ఉప రాష్ట్రపతిగా ఎదగడం చాలా గొప్ప విషయం అంటు ఆయన కొనియాడారు. ఆయక కృషి ఫలితం నేడు ఈ స్థాయికి చేర్చిందని పెర్కొన్నారు. అంతేకాక ఆయన జగన్ కామెంట్లపై స్పందించారు. జగన్ కి చంద్రబాబు రాజకీయ అనుభవం అంతా వయస్సు లేదని, ముఖ్యమంత్రిని కామెంట్లు చేయాడమేంటని ఎద్దేవా చేశారు.
లోకేష్ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రితో భేటీ అవుతారు. అంధ్రకు రావాలసిన నిధుల గురించి చర్చిస్తారు.