అనర్హత పిటిషన్.. రఘురామకు షాక్, లోక్‌సభ సచివాలయం నోటీసులు

By Siva KodatiFirst Published Jul 15, 2021, 10:28 PM IST
Highlights

రఘురామపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు వైసీపీ ఎంపీలు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఇటీవల స్పీకర్‌ను కలిసిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఫిర్యాదుకు అదనపు సమాచారం జోడించారు. ఈ నేపథ్యంలో ఆయనకు గురువారం లోక్‌సభ సచివాలయం నోటీసులు జారీ చేసింది

వైసీపీ యత్నాలు ఫలించాయి. అనర్హత వేటుకు సంబంధించి రఘురామ కృష్ణంరాజుకు లోక్‌సభ సచివాలయం నోటీసులు జారీ చేసింది. దీనిపై 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆయనను కోరారు. రఘురామతో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సిసిర్‌ అధికారి, సునీల్‌ కుమార్‌లకు కూడా ఈ నోటీసులు జారీ అయ్యాయి. రఘురామపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు వైసీపీ ఎంపీలు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఇటీవల స్పీకర్‌ను కలిసిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఫిర్యాదుకు అదనపు సమాచారం జోడించారు. మరోవైపు ఎంపీలు సిసిర్‌ అధికారి, సునీల్‌ కుమార్‌పై టీఎంసీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 

కాగా, కొద్దిరోజుల క్రితం రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని  వైసీపీ మరోసారి ఫిర్యాదు చేసింది.  తాము ఫిర్యాదులు చేసినా స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంపై వైసీపీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోపుగా రఘురామకృష్ణంరాజుపై చర్యల గురించి తేల్చాలని వైసీపీ డిమాండ్ చేసింది. లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించింది. 

Also Read:రఘురామ అనర్హత పిటిషన్.. పరిశీలిస్తున్నాం, త్వరలోనే నిర్ణయం: ఓం బిర్లా క్లారిటీ

దీనిపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. పార్టీ ఫిరాయింపులపై నిర్ణీత కాలపరిమితిలోగా చట్టంలో మార్పులు చేయాలన్నారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా. ప్రభుత్వం చట్ట సవరణ తీసుకొస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అనర్హత వేటుపై ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే నిర్ణయం వుంటుందని స్పీకర్ స్పష్టం చేశారు. వైసీపీ ఫిర్యాదును లోక్‌సభ సచివాలయం పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. పద్దతి ప్రకారమే విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామని ఓం బిర్లా పేర్కొన్నారు. 

click me!