ఏ జ్ఞానం వుండదు.. వారిద్దరి కంటే సామాన్యులే బెటర్: పవన్, లోకేశ్‌లపై ధర్మాన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jul 15, 2021, 7:52 PM IST
Highlights

ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు గుప్పించారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లపై ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికి ఏం జ్ఞానం వుండదని, వారిద్దరి కంటే సామాన్యులే బెటర్ అంటూ ధర్మాన వ్యాఖ్యానించారు. పరిపాలనలో జగన్‌ను విమర్శించడానికి వారు సరిపోరంటూ దుయ్యబట్టారు. 

అంతకుముందు ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంపై జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి విస్తృత సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గతంలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా కాలనీలు కాకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యాన రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా పెద్ద ఎత్తున గ్రామాల నిర్మాణమే జరుగుతోందన్నారు. 

Also Read:రాష్ట్ర విభజన, చంద్రబాబు తప్పులు... అందుకే ఏపీకి ఈ కష్టాలు: జలవివాదంపై ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యలు

ఇళ్ల పట్టాలు అందజేయడం, ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియని, అర్హులు దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో పట్టా మంజూరవుతుందని ధర్మాన చెప్పారు. అధికారులు ఎప్పటికప్పుడు సమస్యలను గుర్తించి ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కృష్ణదాస్ ఆదేశించారు. గ్రామాల్లో ఎలాంటి భూ వివాదాలూ రాకుండా స్వచ్ఛమైన భూ రికార్డులే లక్ష్యంగా భూముల రీ సర్వేను ప్రారంభించామని అన్నారు. దీనిని రూ.వెయ్యి కోట్లతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టామని ధర్మాన తెలిపారు.

click me!