తాడేపల్లిలో మెగా రిటైల్ టెక్స్‌టైల్స్ పార్క్‌కు గ్రీన్ సిగ్నల్.. భారీగా రాయితీలు

By Siva KodatiFirst Published Jul 15, 2021, 9:05 PM IST
Highlights

తాడేపల్లిలో 194.16 కోట్ల పెట్టుబడితో మెగా రిటైల్ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయనుంది ఏపీ సర్కార్. 900 రిటైల్ టెక్స్‌టైల్ ఔట్ లెట్లు వుండేలా పార్క్ నిర్మాణం జరగనుంది. మెగా రిటైల్ పార్క్ ద్వారా 5000 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది

ఆంధ్రప్రదేశ్‌లో రిటైల్ పార్క్స్‌ పాలసీని విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. 2021- 26 కాలానికి రిటైల్ పార్క్స్ పాలసీని రూపొందించింది ఏపీ ప్రభుత్వం. తాడేపల్లిలో మెగా రిటైల్ టెక్స్‌టైల్స్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 7 లక్షల చదరపు అడుగుల్లో మెగా రిటైల్ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు సర్కార్ ఆమోదం తెలిపింది. మెగా రిటైల్ టెక్స్‌టైల్ పార్కు నిర్మించడానికి ముందుకు వచ్చింది కేపిటల్ బిజినెస్ పార్క్ సంస్థ.

Also Read:నెల్లూరు స్టీల్ ప్లాంట్... జిందాల్ సంస్థకు 860ఎకరాలు

194.16 కోట్ల పెట్టుబడితో మెగా రిటైల్ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయనుంది ఆ సంస్థ. 900 రిటైల్ టెక్స్‌టైల్ ఔట్ లెట్లు వుండేలా పార్క్ నిర్మాణం జరగనుంది. మెగా రిటైల్ పార్క్ ద్వారా 5000 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. రిటైల్ పార్క్స్ పాలసీలో తొలి ప్రాజెక్ట్‌గా కేపిటల్ బిజినెస్ పార్క్ సంస్థకు రాయితీలు ప్రకటించింది ప్రభుత్వం. పార్క్ వెలుపల ఏర్పాటు చేసే మౌలిక సదుపాయాల ఖర్చులో 3 కోట్ల రూపాయలకు మించకుండా 50 శాతం తిరిగి ఇవ్వనుంది ప్రభుత్వం. ఈ ప్రాజెక్ట్‌కు వంద శాతం స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపును ఇచ్చింది ఏపీ సర్కార్ . 

click me!