
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజక వర్గం ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావుకు ప్రజల నుండి చుక్కేదురైంది. ఉదయగిరి మార్క్‌పెడ్ లో జరిగిన పసుపు కుంభకోణం ఆయనను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఓ కార్యక్రమంలో పాల్గోనడానికి వచ్చిన రామారావుకు వ్యతిరేకంగా స్థానికుల నినాదాలు చేశారు.
ఎమ్మేల్యే ఉదయగిరిలో జడదేవి గ్రామంలో జరుగుతున్న శ్రీశ్రీశ్రీగంగమ్మతల్లి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. అప్పుడే అక్కడికి చేరుకున్న స్థానికులు కొందరు ఎమ్మేల్యేను నిలదీశారు. పసుపు కుంభకోణంలో ఉన్న వారికి మద్దతు పలుకుతున్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అక్కడి స్థానికుల కుంభకోణానికి పాలుపడ్డవారికి ఎందుకు మద్దతు ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. స్థానికులు అవినీతికి పాల్పడ్డ నాయకులను పార్టీ నుంచి బహిష్కరించాలని వారు నినాదాలు చేశారు. పార్టీలో "నీలాంటి వాళ్లు ఉండటానికి చోటు లేదని" వారు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అయితే చుట్టుపక్కల ఉన్న ఆయన అనుచరులు ప్రజలతో... ఏమైనా మాట్లాడాల్సి ఉంటే కలిగిరి క్యాంపు కార్యాలయానికి వెళ్ళి మాట్లాడాలని సర్ధి చెప్పినప్పటికీ స్థానికులు ఒప్పుకోలేదు. దీంతో చేసేదేమీ లేక తీవ్ర అసహనానికి గురైన బొల్లినేని అక్కడ నుంచి వెళ్ళిపోయారు.