(వీడియో) బయటపడిన బాలకృష్ణ అజ్ఞానం

Published : Aug 16, 2017, 12:38 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
(వీడియో) బయటపడిన బాలకృష్ణ అజ్ఞానం

సారాంశం

నంద్యాల టిడిపి ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డి మరణిస్తే ఉపఎన్నిక వచ్చిందట. సంప్రదాయం ప్రకారం ఆ సీటును టిడిపికే వదిలేయకుండా వైసీపీ పోటీ పెట్టిందట. అధికారంపై వైసీపీకున్న అధికార వ్యామోహం వల్ల, పదవీ పిచ్చి వల్లే ఉపఎన్నికలో పోటీ అనివార్యమైందని బాలకృష్ణ కొత్త అర్ధం చెబతున్నారు. రోడ్డుషోలో బాలకృష్ణ మాటలతో ఆయనలోని రాజకీయ అజ్ఞానమే బయటపడింది.

నంద్యాల ఉపఎన్నిక రోడ్డుషోలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘వైసీపీకి అధికార వ్యామోహం, పదవీ పిచ్చి ఎందుకో తనకు అర్దం కావటం లేద’న్నారు. ఇంతకీ బాలయ్య ఏ సందర్భంలో మాట్లాడారు? నంద్యాల టిడిపి ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డి మరణిస్తే ఉపఎన్నిక వచ్చిందట. సంప్రదాయం ప్రకారం ఆ సీటును టిడిపికే వదిలేయకుండా వైసీపీ పోటీ పెట్టిందట. అధికారంపై వైసీపీకున్న అధికార వ్యామోహం వల్ల, పదవీ పిచ్చి వల్లే ఉపఎన్నికలో పోటీ అనివార్యమైందని బాలకృష్ణ కొత్త అర్ధం చెబతున్నారు.

రోడ్డుషోలో బాలకృష్ణ మాటలతో ఆయనలోని రాజకీయ అజ్ఞానమే బయటపడింది. నంద్యాల సీటు వైసీపీదే అన్న విషయం కూడా బాలయ్యకు తెలీదనే అనుకోవాలా? లేక తెలిసీ చిలకపలుకులు పలుకుతున్నారనుకోవాలా? వైసీపీ తరపున గెలిచిన భూమా నాగిరెడ్డిని టిడిపిలోకి లాక్కుందే చంద్రబాబు అన్న విషయం బాలకృష్ణకు తెలీదా?  పోయిన ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి పోటీ చేసింది, గెలిచింది వైసీపీ నుండే అన్న విషయం ఎవరిని అడిగినా చెబుతారు. అటువంటిది టిడిపిలోకి ఫిరాయించిన తర్వాత జరిగిన పరిణామాలతో భూమా హటాత్తుగా మరణించారన్న విషయం అందరికీ తెలిసిందే.

భూమా మరణించారు కాబట్టే ఉపఎన్నిక వచ్చింది. పార్టీ ఫిరాయించిన తర్వాత తాను రాజీనామా చేస్తానన్నా చంద్రబాబునాయుడే వారించారని  భూమానే ఎన్నోసార్లు చెప్పారు. మరి, ఇపుడు బాలకృష్ణ  రివర్స్ లో చెప్పటమేంటి? అసలు నంద్యాల సీటు ఎవరిదన్న విషయం అసెంబ్లీ రికార్డులో లేక ఎలక్షన్ కమీషన్ వెబ్ సైట్ నో చూస్తే తెలిసిపోతుంది. ఆపాటి జ్ఞానం కూడా లేకుండానే బాలయ్య వైసీపీని విమర్శిస్తున్నారు. వైసీపీ సీటులో టిడిపి పోటీ చేస్తూ మళ్ళీ రివర్స్ లో వైసీపీనే విమర్శించటం ఒక్క తెలుగుదేశంపార్టీకి చెల్లింది.

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu