అనకాపల్లిలో అర్థరాత్రి ఉద్రిక్తత.. మాజీ మంత్రి బాండారు ఇంటి సమీపంలోకి భారీగా చేరుకున్న పోలీసులు

Published : Oct 02, 2023, 06:49 AM IST
అనకాపల్లిలో అర్థరాత్రి ఉద్రిక్తత.. మాజీ మంత్రి బాండారు ఇంటి సమీపంలోకి భారీగా చేరుకున్న పోలీసులు

సారాంశం

టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంటికి ఆదివారం అర్థరాత్రి భారీగా పోలీసులు చేరుకున్నారు. ఈ విషయంలో ఆయన పార్టీ శ్రేణులకు తెలిసింది. దీంతో వారంతా ఆయన నివాసానికి రావడం మొదలుపెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ఆదివారం అర్థరాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరవాడ మండలం వెన్నెలపాలెంలో ఉన్న టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి నివాసానికి సమీపంలో భారీగా పోలీసులు చేరుకోవడానికి ఈ పరిస్థితులకు కారణం అయ్యింది. 

Ujjain Rape| "ఆ చిన్నారికి నా చొక్కానే ఇచ్చా.." : కీలక విషయాలను వెల్లడించిన ఆటో డ్రైవర్‌

వెన్నెలపాలెంలో ఉన్న మాజీ మంత్రి ఇంటికి వెళ్లే దారిలో ఉన్న సినిమా హాల్ చౌరస్తా,  కరెంట్ సబ్ స్టేషన్ చౌరస్తా తో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. మాజీ మంత్రి ఇంటికి ఎవరూ వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అర్థరాత్రి సమయంలో ఇంత మంది పోలీసులు తమ నాయకుడి ఇంటికి ఎందుకు వచ్చారో అర్థంకాక ఆ పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు. పోలీసులు తీరపై తీవ్రంగా మండిపడ్డారు. 

విజయవాడ దుర్గగుడి ఈవోపై బదిలీ వేటు.. దసరా ఉత్సవాలకు ముందు కీలక పరిణామం

ఇటీవల ఏపీ మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ మహిళా కమివషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసులను కోరారు. ఈ మేరకు ఆమె శనివారం డీజీపీకి లేఖ రాశారు. మాజీ మంత్రి అనుచిత వ్యాఖ్యలుపై కేసు నమోదు చేయాలని, చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో ఆమె ప్రస్తావించారు. అందుకే మాజీ మంత్రి ఇంటికి పరవాడ డీఎస్పీ, సీఐలు భారీ బందోబస్తుతో చేరుకున్నారని ‘ఈనాడు’ పేర్కొంది.

చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 28న శ్రీవారి ఆలయం మూసివేత .. ఆ సేవలు కూడా రద్దు

కాంపౌండ్ వాల్ దూకి లోపలికి వెళ్లారు. అనంతరం మాజీ మంత్రి బండారుకు 41ఏ నోటీసులు జారీ చేసి, తరువాత ఆయనను పోలీసు స్టేషన్ కు తీసుకొని వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై సమాచారం అందుకున్న టీడీపీ నాయకులు భారీగా ఆ ప్రాంతానికి తరలివచ్చారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మహిళలు వచ్చారు. అయితే ఎక్కడివారిని అక్కడే పోలీసులు నిలిపివేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

విశాఖలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్ | Pawan Kalyan Visakhapatnam Tour| Asianet News Telugu
పసిఫిక్ మహాసముద్రంలో తుపాను...ఏపీ, తెలంగాణలో వర్షాలు | AP & Telangana Weather | Asianet News Telugu